Begin typing your search above and press return to search.
చార్టెడ్ విమానంలో సునామీ ప్రచారమా?
By: Tupaki Desk | 17 Aug 2019 2:30 PM GMTఇండియా మొత్తం తెలుగు చిత్రసీమ వైపు చూస్తోంది. గతంలో దక్షిణాది సినిమా అంటే లైట్ తీసుకున్న బాలీవుడ్ దిగ్గజాలు ఇట్నుంచి సినిమా వస్తోందంటే ఎంతో అటెన్షన్ తో ఎదురుచూస్తున్నారు. `బాహుబలి`తోనే ఈ మార్పు మొదలైంది. ప్రభాస్ నటించిన ఈ సినిమా ప్రపంచ సినీయవనికపై తెలుగు సినిమా కీర్తిబావుటాను ఎగురవేసి తెలుగువాడి సత్తాని చాటింది. మళ్లీ అదే స్థాయిలో తెలుగు తెరపై వస్తున్న సినిమాగా `సాహో`కి పాపులారిటీ దక్కింది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్.. నార్త్ అనే తేడా లేకుండా నలుదిక్కుల నుంచి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకని చిత్ర బృందం భారీ స్థాయిలో ప్లాన్ చేసింది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో లక్ష మంది ప్రభాస్ అభిమానుల మధ్య అట్టహాసంగా ఈ ఈవెంట్ ని 2 కోట్ల భారీ వ్యయంతో నిర్వహించడానికి నిర్మాణ వర్గాలు భారీ ఏర్పాట్లు చేశాయి. తెలుగు- తమిళ- మలయాళ - హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదల కానుండటంతో ఆయా భాషల్లో పాపులర్ కావడం కోసం ఒకే వేదిక ద్వారా పబ్లిసిటీని గుప్పించడం కోసం చిత్ర బృందం ఈ ఈవెంట్ ని వాడుకోబోతోంది. దీనితో పాటు మరో మెస్మరైజింగ్ ప్లాన్ ని సిద్ధం చేశారని తెలిసింది.
రిలీజ్ కి సమయం దగ్గరపడుతుండటంతో పబ్లిసిటీని పరుగులు పెట్టించబోతున్నారు. ఒక్కో నగరానికి ఒక్కో రోజు కేటాయించడమే కాదు.. సునామీ ప్రచారం కోసం ఓ చార్టెడ్ ఫ్లైట్ ని బుక్ చేసుకున్నారని తెలుస్తోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్ని చుట్టి రావడం కోసం ప్రత్యేకంగా ప్రభాస్ కోసం ఓ చార్టెడ్ ఫ్లైట్ ని రంగంలోకి దించేస్తున్నారు. దీని కోసం భారీగా ఖర్చు చేస్తున్నారట. ఇందులో ప్రభాస్ తో పాటు సినిమాకు సంబంధించిన కీలక వ్యక్తులు మాత్రమే ప్రయాణించనున్నారని తెలిసింది. సాహో ప్రపంచవ్యాప్తంగా ఈనెల 30న రిలీజవుతోంది. ఇంకో 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్న సంగతి తెలిసిందే.