Begin typing your search above and press return to search.
మెగా అభిమానులకు బిగ్ రిలీఫ్
By: Tupaki Desk | 14 Dec 2022 3:30 AM GMTసెలబ్రెటీల వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో చర్చలు పెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదు. కానీ అక్కడ ఎప్పుడూ చర్చలు నడిచేదే ప్రముఖుల వ్యక్తిగత విషయాల మీద. సినిమాల విషయంలో హీరోల అభిమానుల మధ్య ఏవైనా గొడవలు.. చివరికి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లిపోతారు. కుటుంబ విషయాలు బయటికి తీసి వాటి మీద దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంటారు.
చివరికి ఒక హీరో పెళ్లయిన వెంటనే తండ్రి కాకపోవడం కూడా యాంటీ ఫ్యాన్స్ టార్గెట్ చేేసే విషయంగా మారిపోవడం దురదృష్టకరం. ఎప్పట్నుంచో శత్రుత్వం ఉన్న వేరే హీరోల ఫ్యాన్స్ ఇలా ఎటాక్ చేసినా ఇది మామూలేలే అనుకోవచ్చు కానీ.. ఒక హీరో మీద ఆ హీరో కుటుంబానికే చెందిన మరో హీరో అభిమానులు దాడి చేయడం.. దారుణమైన హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రోల్ చేయడం దారుణం.
అలాగని ఇవతలి హీరో అభిమానులు కూడా తక్కువ తినలేదు. అదే స్థాయిలో వ్యక్తిగత విషయాలతో ఎదురు దాడి చేశారు. ఇదంతా కొన్ని రోజుల కిందట రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన విషయం. ఐతే ఈ కామెంట్లు, ట్రోల్స్ సంగతి పక్కన పెడితే.. రామ్ చరణ్ తండ్రి అయితే చూడాలని కోరుకుంటున్న అభిమానుల సంఖ్య పెద్దదే.
వారి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. చరణ్ శుభవార్త చెప్పేశాడు. ఇలాంటి విషయాల మీద ఒక డిస్కషన్ పెట్టడం కరెక్ట్ కాదు కానీ.. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరిగినపుడు ఈ టాపిక్ తెచ్చి దారుణమైన కామెంట్లు చేసే అవకాశం అవతలి వారికి లేకుండా పోయిందని చరణ్ ఫ్యాన్స్ రిలీఫ్ ఫీలవుతున్నారు. ఇలాంటి ఆలోచన అభిమానులకు వస్తోందంటే టాలీవుడ్లో ఫ్యాన్ వార్స్ ఏ స్థాయికి దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.