Begin typing your search above and press return to search.
దర్బార్ నిర్మాతలకు బిగ్ షాక్
By: Tupaki Desk | 31 Dec 2019 5:48 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `దర్బార్` సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్- ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసాయి. సూపర్ స్టార్ ని కాప్ పాత్రలో చూడాలన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. 2.0 తర్వాత లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకం గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందకు తీసుకు రావడానికి సర్వం సిద్దం చేస్తోంది. అమెరికా- మలేషియా- థాయ్ లాండ్ లాంటి దేశాల్లో ప్రత్యేక ప్రీమీయర్ల కు సైతం రెడీ చేస్తోంది. అయితే ఇంతలోనే చిత్ర బృందానికి ఊహించని షాక్ తగిలింది.
దర్బార్ రిలీజ్ ని ఆపాల్సిందిగా మద్రాసు హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. మలేషియాకు చెందిన డి.ఎమ్.వై క్రియేషన్స్ సంస్థ... దర్బార్ రిలీజ్ ని తాత్కలికం గా వాయిదా వేయాలంటూ కోర్టు ను ఆశ్రయించింది. దీంతో దర్బార్ రిలీజ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. లైకా సంస్థ తమకు చెల్లించాల్సిన 2,305 కోట్ల బాకీ చెల్లించని కారణం గా డి.ఎమ్.వై క్రియేషన్స్ పిల్ వేసినట్లు వెల్లడించింది. రోబో- 2.0- దర్బార్ చిత్రాలకు ఆ సినిమా కొంత పైనాన్స్ ఇచ్చిందిట. కానీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయినా సదరు సంస్థకు బ్యాలెన్స్ సహా పాత బకాయిలు చెల్లించని కారణంగా రిలీజ్ వాయిదా వేయాలంటూ కోర్టు ను కోరినట్లు తెలుస్తోంది.
వాటికి సంబంధించిన ఆధారాలను డి.ఎమ్.వై కోర్టు కు సమర్పించింది. పిటీషన్ పై జనవరి 2 లోపు వివరణ ఇవ్వాలని లైకా సంస్థకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు వివరణ కోరిన నేపథ్యంలో ఇచ్చిన గడువు లోపు లైకా సమాధానం చెప్పాల్సి ఉంది. లేదంటే దర్బార్ జనవరి 9న రిలీజ్ అవ్వడం కష్టమేనన్న ప్రచారం ఇప్పుడు కోలీవుడ్ సహా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రజనీ సినిమాలు ఇటీవల కాలంలో పెద్దగా సక్సెస్ అవ్వడం లేదు. తమిళ మార్కెట్ సంగతి ఎలా ఉన్నా.. తెలుగు మార్కెట్ పై ఆ ప్రభావం కనిపిస్తూనే ఉంది. మరి లైకా వివరణ ఎలా ఉంటుందో చూడాలి.