Begin typing your search above and press return to search.

'కాంతార‌' టీమ్ కు ఊహించ‌ని బిగ్ షాక్‌!

By:  Tupaki Desk   |   29 Oct 2022 7:43 AM GMT
కాంతార‌ టీమ్ కు ఊహించ‌ని బిగ్ షాక్‌!
X
క‌న్న‌డ హీరో, ద‌ర్శ‌కుడు రిష‌బ్ శెట్టి న‌టించి తెర‌కెక్కించిన సెన్సేష‌ల్ మూవీ 'కాంతార‌'. స‌ప్త‌మి గౌడ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీని 'కేజీఎఫ్‌' మేక‌ర్స్ హోబలే ఫిలింస్ అథినేత విజ‌య్ కిర‌గందూర్ నిర్మించారు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా క‌న్న‌డ‌లో విడుద‌లైన ఈ మూవీ అక్క‌డ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల సునామీని సృష్టించింది. క‌న్న‌డ వెర్ష‌న్ లో రికార్డు స్థాయి విజయాన్ని సాధించ‌డ‌మే కాకుండా వంద కోట్లకు పైగా వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ఔరా అనిపించింది.

ఇదే సినిమాని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లోనూ విడుద‌ల చేశారు. తెలుగులో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ మూవీ 13 రోజుల‌కు గానూ ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 45 కోట్ల గ్రాస్ ని వ‌సూలు చేసి విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది. క‌న్న‌డ‌లో సంచ‌ల‌నాలు సృష్టించిన ఈ మూవీ తెలుగులోనూ అదే స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతుండ‌టం ప‌లువురు ట్రేడ్ వ‌ర్గాల‌ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ప‌రిచ‌యం లేని హీరోకు తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌టంతో 'కాంతార‌' స‌రికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

హిందీలోనూ ఇదే స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ అక్క‌డిట్రేడ్ పండితుల్ని విస్మయానికి గురిచేస్తున్న 'కాంతార‌' ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. విమ‌ర్శ‌కుల‌తో పాటు సినీ స్టార్స్‌, క్రేజీ హీరోలు, బాలీవుడ్ ద‌ర్శ‌కులు, హీరోయిన్ లు కూడా ఈ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో 'కాంతార' చుట్టూ కాపీ వివాదం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. భూత‌కోల ఆధారంగా తెర‌కెక్కిన ఈమూవీలోని క్లైమాక్స్ స‌న్నివేశాల్లో 'వ‌రాహ రూపం దైవ వ‌రిష్టం..' అంటూ సాగే పాట ఇప్ప‌డు వివాదంగా మారింది.

ఈ సినిమాకు అత్యంత కీల‌కంగా నిలిచిన ఈ పాట చుట్టూ వివాదం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ పాట కాపీ అంటూ మ‌ల‌యాళంకు చెందిన 'తైక్కుడం బ్రిడ్జ్' మ్యూజిక్ బ్యాండ్ వారు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాము విడుద‌ల చేసిన 'న‌వ‌ర‌సం' ని కాపీ చేశారంటూ ఆరోప‌ణ‌లు చేశారు. అంతే కాకుండా ఆ పాట‌ని సినిమా నుంచి తొల‌గించాల్సిందే అంటూ 'తైక్కుడం బ్రిడ్జ్' మ్యూజిక్ బ్యాండ్ వారు కోర్టుని ఆశ్ర‌యించారు.

దీంతో కేర‌ళ‌లోని థియేట‌ర్ల‌తో పాటు ఇత‌ర స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ల‌లో 'వ‌రాహ రూపం' పాట‌ను ప్లే చేయ‌కూడ‌ద‌ని, వెంట‌నే తొల‌ల‌గించాల‌ని కేర‌ళ కోజికోడ్ సెష‌న్స్ కోర్టు 'కాంతార‌' నిర్మాత‌లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో చిత్ర నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ తో పాటు ఓటీటీ, స్పాటిఫై వంటి సంస్థ‌ల‌కు నోటీసులు జారీ చేసి 'కాంతార‌' టీమ్ కు షాకిచ్చింది. ఈ నేప‌థ్యంలో సినిమాకు అత్యంత కీల‌కంగా నిలిచిన ఈ పాట‌ని 'కాంతార‌' టీమ్ తొలిగిస్తే సినిమాకు ఆయువు ప‌ట్టుని కోల్పోయిన‌ట్టేన‌ని, అదే జ‌రిగితే 'కాంతార‌' థియేట‌ర్ల‌లో ర‌న్ క‌ష్ట‌మేన‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.