Begin typing your search above and press return to search.
మాస్ మహారాజ్ కిది బిగ్ షాక్ అన్నట్టేగా!
By: Tupaki Desk | 5 Dec 2022 4:30 PM GMTఈ మధ్య థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు బ్రాండ్ వ్యాల్యూ వుందా?.. పేరున్న హీరో, దర్శకుడు, భారీ నిర్మాణ విలువలతో సినిమాలు నిర్మించే నిర్మాణ సంస్థ నిర్మించిన సినిమా అని చూడటం లేదు. కంటెంట్ కి మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారు. కంటెంట్ నచ్చితే కొత్త హీరో.. పాత హీరో అని చూడటం లేదు. కంటెంట్ గురించి పది మంది మాట్లాడుకున్నారంటే చాలు ఆ సినిమాని ఆదరిస్తున్నారు. చిన్న హీరోయి సినిమా అయినా సరే బ్రహ్మరథం పడుతున్నారు.
స్టార్ నటించాడు.. స్టార్ ప్రొడ్యూస్ చేశాడు.. సమర్పకుడిగా వ్యవహరించాడు.. అంటే వినడం లేదు. కంటెంట్ లేకపోతే మెగాస్టార్ సినిమానే రిజెక్ట్ చేస్తున్నరోజులివి. ఈ నేపథ్యంలో మాస్ మహారాజా రవితేజకు బిగ్ షాక్ తగిలింది. వరుస సినిమాల్లో నటిస్తున్న రవితేజకు తమిళ హీరో విష్ణు విశాల్ తో మంచి అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధంతో తను నటించిన సినిమాలని రవితేజ తెలుగులో సపోర్ట్ చేస్తున్నాడు. అయితే అవి ఆశించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోవడం లేదు.
ఆ మధ్య విష్ణు విశాల్ నటించిన 'ఎఫ్ ఐ ఆర్' మూవీకి తెలుగులో రవితేజ సమర్పకుడిగా వ్యవహరించాడు. మను ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అనవసరంగా చేయని తప్పుకు శిక్షపడిన ముస్లీమ్ యువకుడిగా విష్ణువిశాల్ నటించిన ఈ మూవీ విమర్శకులు ప్రశంసల్ని దక్కించుకున్నా ఎందుకో ప్రేక్షకుల మనసుని మాత్రం గెలుచుకోలేకపోయింది. సరైన పబ్లిసిటీ లేకపోవడం.. విష్ణు విశాల్ తెలుగులో పెద్దగా తెలియకపోవడంతో ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.
రవితేజ తొలిసారి సమర్పకుడిగా వ్యవహరించిన ఈ మూవీ తొలి ప్రయత్నంలోనే షాకిచ్చింది. ఇక రీసెంట్ గా విష్ణు విశాల్ నటించిన మరో సినిమాని కూడా రవితేజ తెలుగులో విడుదల చేశాడు. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ పేరు 'మట్టికుస్తీ'. చెల్లా అయ్యవు డైరెక్ట్ చేసిన ఈ తమిళ సినిమా కుస్తీ పోటీల నేపథ్యంలో ప్రధానంగా సాగకపోయినా టైటిల్ ని బట్టి అంతా అదే కథ అనుకున్నారు.
దీంతో ఈ మూవీని పెద్దగా ఆదరించడం లేదు. తొలి రోజే మంచి టాక్ ని సొంతం చేసుకున్నా ఈ మూవీని తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు.
దీంతో రవితేజ సమర్పకుడిగా వ్యవహరించినా ఆయన బ్రాండ్ పని చేయలేదని. ఓ విధంగా రవితేజ నిర్మాతగా మరో సారి విఫలమయ్యాడనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.