Begin typing your search above and press return to search.

గంగూబాయికి బిగ్ షాక్..కేసులు మీద కేసులు!

By:  Tupaki Desk   |   22 Feb 2022 1:30 PM GMT
గంగూబాయికి బిగ్ షాక్..కేసులు మీద కేసులు!
X
బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో `గంగూబాయి క‌తియావాడి` ఈనెల 25న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. రిలీజ్ కి ఇంకా మూడు రోజులే స‌మ‌యం ఉంది. స‌రిగ్గా రిలీజ్ టార్గెట్ గా `గంగూబాయి క‌తివాడి`పై క‌మాతీపుర నివాసితులు స‌హా ముంబై లో నెలొక‌న్న వివిధ సంఘాలు క‌న్నెర్ర‌జేసాయి. సినిమాలో ట్రైల‌ర్ తోనే క‌మాతీపుర ప్ర‌తిష్ట‌ని దిగ‌జార్చార‌ని మండిప‌డుతున్నారు.

క‌మాతీపుర‌ ని క్రూర‌మైన రెడ్ లైట్ హ‌బ్ గామార్చేసి సినిమా తీసార‌ని భ‌గ్గుమంటున్నారు. ఈ వివాదానికి సంబంధించి క‌మాతీపుర‌ వాసులు ముంబై హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసారు. సినిమా ట్రైల‌ర్ త‌ర్వాత ఈ ప్రాంతం ప‌తిష్ట దెబ్బ‌తింది. ప్రాంతం మొత్తాన్ని రెడ్ లైట్ ఏరియాగా చూస్తున్నారని పిటీష‌న్ లో పేర్కొన్నారు. క‌మాతీపుర లో 55 మంది నివాసితుల త‌రుపున ఒక మ‌హిళ ఈ పిటీష‌న్ దాఖ‌లు చేసింది.

సినిమాకి సెన్సార్ స‌ర్టిపికెట్ ఇవ్వ‌కూడ‌ద‌ని బోర్డు నిర్ణ‌యాన్ని త‌ప్పుబట్టారు. ఈ సినిమా వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజం ఏంటో చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఆడ‌పిల్ల‌లంద‌రినీ వేశ్య‌గా చిత్రీక‌రిస్తారా? ఆడిపిల్ల‌ల్ని వాళ్ల కుటుంబాల్ని అవ‌మ‌నా పరుస్తారా? ఈ సినిమా ద్వారా ప్ర‌జ‌ల‌కు ఏం చెప్పాల‌నుకున్నారో? స‌మాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

సినిమాలో క‌మాతీపుర‌ పేరు ని తొల‌గించాల‌ని..రిలీజ్ పై స్టే విధించాల‌ని విజ్ఞ‌ప్తి చేసారు. ఇదే విధ‌మైన ఉప‌శ‌మనం కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ ప‌టేల్ కూడా ప్ర‌త్యేక ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేసారు. ఇంకా సామాజిక సేవా సంస్థ‌లు..పున‌ర్జీవ‌న్ రాహివాసి సేవా మండ‌ల్. అఖిల‌ప‌ద్మశాలి స‌మాజ్.. తిరంగ్ హౌసింగ్ సొసైటీ.. ఖాటిక్ స‌మాజ్.. గుజ‌రాతీ ట్ర‌స్ట్ లు గంగూబాయి క‌తియ‌వాడికి వ్య‌తిరేకంగా పిటీష‌న‌ర్ కి లేఖ‌లు రాసారు.

బుధ‌వారం ఈ పిటీష‌న్ విచార‌ణ‌కు రానుంది. జ‌స్టీస్ జీఎస్ ప‌టేల్ నేతృత్వంలోనే ధ‌ర్మాస‌నం విచారించ‌నుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నిర్మాత లు..అలియాభ ట్..ద‌ర్శ‌కుడు..పుస్త‌క ర‌చ‌యిత‌లు ఎస్ హుస్సేన్ జైదీ.. జేన్ బోర్గెస్ ల‌పై ప‌రువు న‌ష్టం దావా కేసులు ప‌డ్డాయి. గంగూబాయి క‌తియ‌వాడి ద‌త్త‌పుత్రుడిగా చెప్పుకునే బాబూజీ షా అనే వ్య‌క్తి ఈ ప‌రువు న‌ష్టం దావా వేసాడు. మ‌రి ఈ సినిమాని రిలీజ్ చేయాలా? లేదా? అన్నది ముంబై ధ‌ర్మాస‌నం తీర్పు పై ఆధార‌ప‌డి ఉంది.

అయితే బాలీవుడ్ సినిమాల రిలీజ్ కి ముందు ఇలాంటి హ‌డావుడి స‌హ‌జ‌మే. ఆ సినిమాల జాబితా చాలా పెద్ద‌దే ఉంటుంది. స‌రిగ్గా రిలీజ్ కి రెండు ..మూడు రోజుల ముందు ఆపాలంటూ హ‌డావుడి చేసిన సంద‌ర్భాలున్నాయి. వివాదాస్ప‌ద అంశాల్ని సెన్సార్ స‌మ‌యంలోనే క‌త్తెర వేస్తున్నారు.

1960 లో ముంబైలోని ఇండియాన్ మాఫియా డాన్..వేశ్య వృత్తి కి బాస్ గా క‌మాతీపుర లో చెలామ‌ణి అయిన గంగూబాయి క‌తియావాడి జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఆమె పాత్ర‌లోనే అలియాభ‌ట్ న‌టించింది.