Begin typing your search above and press return to search.
సాయి పల్లవి ఫ్యాన్స్ కి బిగ్ షాక్?
By: Tupaki Desk | 26 May 2022 8:30 AM GMTటాలీవుడ్ లో గత కొంత కాలంగా హాట్ టాపిక్ గా మారిన మూవీ `విరాటపర్వం`. రానా హీరోగా నటించిన ఈ చిత్రంలో క్రేజీ లేడీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. వేణు ఊడుగుల డైరెక్షన్ లో సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించారు. డి. సురేష్ బాబు సమర్పకులుగా వ్యవహరించిన ఈ మూవీ గత కొంత కాలంగా రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తోంది. భారీ చిత్రాలు, చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నా గత కొన్ని నెలలుగా ఈ మూవీ రిలీజ్ పై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమాపై రిలీజ్ పై రక రకాల వార్తలు పుట్టుకొచ్చాయి.
ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుందని, థియేటర్లలో రిలీజ్ కావడం కష్టమేనంటూ పలు రకాల వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
జూలై 1న ఈ మూవీ రిలీజ్ కానుందని స్పష్టం చేశారు. 50 రోజులకు మించి రిలీజ్ డేట్ వుండటంతో ఫ్యాన్స్ మరీ ఇన్ని రోజులు ఆగాల్సిందేనా అంటూ కామెంట్ లు చేయడంతో హీరో రానా సినిమాపై స్పష్టతనిచ్చారు. లేట్ అయినా సరే ఓ ఎపిక్ క్లాసిక్ మూవీని మీకు అందిస్తానని ప్రామిస్ చేస్తున్నానన్నారు.
దీంతో ఈ మూవీపై రానా ఎంతో కాన్ఫిడెంట్ గా వున్నారనే విషయం స్ఫస్టమైంది. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సాయి పల్లవి అభిమానుల్ని షాక్ కు గురిచేస్తోంది. ఉత్తర తెలంగాణలో 90వ దశకంలో నక్సలిజం పాతాక స్థాయిలో సంచలనాలు సృష్టించింది. ఆనాటి సంగతుల, ఆసక్తికర సంఘటనల సమాహారంగా ఈ మూవీని దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించారు. రిలీజ్ కుముందే వార్తల్లో నిలిచిన ఈ మూవీ తాజాగా సాయి పల్లవి పాత్ర పరంగానూ ఇప్పడు వైరల్ గా మారిందని చెబుతున్నారు.
ఈ చిత్రంలో సాయి పల్లవి వెన్నెల గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఉద్యమ నాయకుడు రవన్నగా కనిపించబోతున్నారు. అతని రచనలకు ఆకర్షితురాలై అతన్ని వెతుక్కుంటూ అరణ్యం బాట పట్టిన వెన్నెల జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారంగా ఈ మూవీని రూపొందించారు. సినిమాకు ప్రధాన బలంటగా నిలిచే సాయి పల్లవి పాత్రకు విషాదాంతపు ఎండింగ్ ని ఇచ్చారట. సినిమాలో సాయి పల్లవి పాత్రని ప్రియమణి ( భారతక్క) పాత్ర హత్య చేస్తుందట.
దీంతో సాయి పల్లవి పాత్ర సినిమాలో ముగిసిపోతుందని తెలుస్తోంది. ఇది ఆమె ఫ్యాన్స్ కి నిజంగా షాకింగ్ విషయమే అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. ట్రాజెడీ ఎండింగ్ తో సినిమాకు దర్శకుడు వేణు ఊడుగుల శుభం కార్డు వేసినట్టుగా ఇన్ సైడ్ టాక్. అదిలాబాద్ లో జరిగిన ఓ యదర్ధ ఘటనని తీసుకుని సాయి పల్లవి పాత్రని దర్శకుడు మలిచినట్టుగా తెలుస్తోంది. ఇన్ ఫార్మర్ గా ఆపోయపడిన నక్సల్స్ బృందం ఓ యువతిని హతమార్చారట. అదే యువతి స్ఫూర్తితో సాయి పల్లవి పాత్రని `విరాటపర్వం`లో డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ తరహా షాక్ ని తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా సాయి పల్లవి అభిమానులు ఎలా స్వీకరిస్తారో చూడాలి.