Begin typing your search above and press return to search.

బిగ్ షాకిస్తున్న లారెన్స్ మాస్టార్ బీస్ట్ లుక్

By:  Tupaki Desk   |   14 Sep 2022 4:33 AM GMT
బిగ్ షాకిస్తున్న లారెన్స్ మాస్టార్ బీస్ట్ లుక్
X
సూప‌ర్ స్టార్ రజనీకాంత్ న‌టించిన‌ 'చంద్రముఖి' తమిళం - తెలుగులో పెద్ద‌ హిట్ గా నిలిచింది. 2005లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఒక ట్రెండ్ సెట్ట‌ర్. ఆ త‌ర్వాత ర‌జ‌నీ కాంత్ తో నిర్మాత‌లు సీక్వెల్ కోసం ప్ర‌య‌త్నించింది లేదు.

ఇన్నాళ్టికి అదే ద‌ర్శ‌కుడు రాఘవ లారెన్స్ తో 'చంద్రముఖి 2' ని తెర‌కెక్కిస్తున్నారు.

పి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ మైసూర్ లో పూర్తయింది. ఈరోజు లారెన్స్ బీస్ట్ లుక్ లో ఉన్న ఫోటోని పోస్ట్ చేసి అందరినీ షాక్ కు గురి చేశాడు. లారెన్స్ చంద్ర‌ముఖి2 కోసమే ఇలా మారాన‌ని.. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని అన్నారు.

లారెన్స్ మేకోవ‌ర్ అద్భుతం. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కండ‌లు పెంచి హీ మ్యాన్ లా మారిన అత‌డిపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ హారర్ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.

అలాగే లారెన్స్ మాస్టార్ వేరొక ట్వీట్ లో తన ట్రస్ట్ కు ఇకపై విరాళాలు ఇవ్వవద్దని కోరాడు. ఎందుకంటే ఇక నుండి దానిని ఒంటరిగా చూసుకుంటానని తెలిపాడు. కాంచ‌న సిరీస్ త‌ర్వాత లారెన్స్ మాస్టార్ మ‌రో ప్ర‌యోగం ఏ విధంగా ఉంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.