Begin typing your search above and press return to search.

దీపావ‌ళికి ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇస్తాడ‌ట‌!

By:  Tupaki Desk   |   17 Sep 2022 1:30 AM GMT
దీపావ‌ళికి ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇస్తాడ‌ట‌!
X
త‌మిళ హీరో కార్తికి తెలుగులోనూ మంచి మార్కెట్ వున్న విష‌యం తెలిసిందే. హీరో సూర్య కు భిన్నంగా తెలుగు నేర్చుకున్న కార్తి తెలుగులో రిలీజ్ అయ్యే త‌న సినిమాల‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ అయ్యాడు. చియాన్ విక్ర‌మ్ తో క‌లిసి కీల‌క పాత్ర‌లో త‌ను న‌టించిన పీరియాడిక‌ల్ వండ‌ర్ `పొన్నియిన్ సెల్వ‌న్ 1` సెప్టెంబ‌ర్ 30న త‌మిళ‌, తెలుగు భాష‌ల‌తో పాటు మొత్తం ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది.

దిగ్రేట్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ మూవీలో కార్తీ వ‌ల్లవ‌రాయ‌న్ వందియా దేవ‌న్ గా ఆదిత్య క‌రికాలుడికి సామంతుడిగా, అత్యంత స‌న్నిహితుడిగా క‌నిపించ‌బోతున్నాడు. కార్తి న‌టిస్తున్న తొలి పీరియాడిక‌ల్ మూవీ కావ‌డంతో అత‌ని అభిమానులు, కార్తి ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నార‌ట‌. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత కార్తి మ‌రో విభిన్న‌మైన స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

అభిమ‌న్యు, హీరో వంటి సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న పీ.ఎస్ మిత్ర‌న్ ఈ మూవీని `స‌ర్దార్‌` పేరుతో తెర‌కెక్కిస్తున్నాడు. ర‌ష్మిక మంద‌న్న, `జై భీమ్` ఫేమ్ ర‌జీషా విజ‌య‌న్ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. ఒక‌నాటి హీరోయిన్ లైలా సుధీర్ఘ విరామం త‌రువాత మ‌ళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ని ఈ మూవీతో స్టార్ట్ చేస్తోంది. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా, స‌ర్దార్ గా రెండు భిన్న‌మైన పాత్ర‌ల్లో కార్తి న‌టిస్తున్నాడు.

తెలుగులో ఈ మూవీని అన్న‌పూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేయ‌బోతోంది. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీని దీపావ‌ళికి అక్టోబ‌ర్ 24న రిలీజ్ చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ సింగిల్‌, టీజ‌ర్ ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ ద‌ర్శ‌కుడు షేర్ చేసిన పోస్ట‌ర్ ఫ్యాన్స్ ని ఆక‌ట్టుకుంటోంది. ఓ ప‌క్క ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా, మ‌రో ప‌క్క మాసిన గ‌డ్డంతో వ‌య‌సు మ‌ళ్లిన గ్యాంగ్ స్ట‌ర్ గా కార్తి క‌నిపిస్తున్న తీరు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.