Begin typing your search above and press return to search.

RRR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   31 Dec 2019 1:12 PM GMT
RRR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ శ‌రవేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే 70శాతం పైగా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. తాజాగా యూనిట్ కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతోన్న సంద‌ర్భంగా సినిమా ప్ర‌చారం షురూ చేసింది. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయ్యే లోపు ప్ర‌తీ పండగ‌ని టార్గెట్ చేసింది. జ‌న‌వ‌రి 1 సంద‌ర్భంగా స‌రికొత్త పోస్ట‌ర్ రిలీజ్ చేస్తున్న‌ట్లు తాజాగా రివీల్ చేసారు. అయితే యూనిట్ ప్ర‌క‌ట‌నకు ముందే ఓ అభిమాని నుంచి గ‌మ్మైత్త‌యిన‌ ప్ర‌శ్న రావ‌డంతో యూనిట్ ఓపెన్ అయింది. పోస్ట‌ర్ రిలీజ్ చేస్తున్న‌ట్లు ముందుగా ఓ అభిమాని ట్వీట్ చేసాడు.

న్యూ ఇయ‌ర్ వ‌స్తుందిగా సిద్దంగా ఉండండి...ఇక‌పై ప్ర‌తి పండ‌క్కి ఆర్.ఆర్.ఆర్ నుంచి ఓ స్పెష‌ల్ ఉంటుంద‌ని ట్వీట్ చేసాడు. దీంతో యూనిట్ అవును ..ఆ ప‌నిలోనే ఉన్నామ‌ని కోపంతో ఉన్న ఎమోజీని...న‌వ్వుతోన్న ఎమోజీని షేర్ చేసింది. ఇయ‌ర్ ఆఫ్ RRR...హ్యాపీ RRR ఇయ‌ర్ ట్యాగ్ ల‌ను ట్రెండ్ చేసి 2020 కి స్వాగ‌తం చెబుదామ‌ని ఫ్యాన్ ట్వీట్ ని ఉద్దేశించి రివీల్ చేసారు. ఇంతవ‌ర‌కూ బాగానే ఉంది. మ‌రి ఆ వ్య‌క్తి నిజంగా ఫ్యాన్ నా? లేక యూనిట్ ఇలా ప్లాన్ చేసిందా? అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

భోగి..మ‌కర‌ సంక్రాంతి.. క‌నుమ..ఉగాది..మ‌హాశిరాత్రి ఇలా ముఖ్య‌మైన పండ‌గ‌ల‌న్నింటిని ఆర్.ఆర్.ఆర్ టీమ్ టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. జ‌న‌వ‌రి 1 నుంచి సినిమా రిలీజ్ అయ్యే వ‌ర‌కూ అంటే.. జూలై 30 వ‌ర‌కూ వ‌చ్చే పండుగ‌ల‌న్ని మెగా- నంద‌మూరి అభిమానుల‌కు బిగ్ ట్రీట్ అనే అనాలి. ఇక పాన్ ఇండియా కేటగిరీ మూవీ ఆర్.ఆర్.ఆర్ పై అంచ‌నాలు ఎలా! ఉన్నాయో విడిగా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే బాహుబ‌లి రికార్డుల‌ను ఆర్.ఆర్.ఆర్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి.