Begin typing your search above and press return to search.
జస్ట్ ఇన్: కొరటాల శివకు చివరి నిమిషంలో బిగ్ ట్వీస్ట్?
By: Tupaki Desk | 19 July 2022 7:30 AM GMTస్టార్ డైరెక్టర్ కొరటాల శివని 'ఆచార్య' సమస్యలు వెంటాడుతూనే వున్నాయి. ఒక సమస్య కొలిక్కి వచ్చిందనుకుంటే వెంటనే మరో సమస్య తెరపైకి వచ్చి కలవరపెడుతూనే వుంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల అరుదైన కలయికలో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన 'ఆచార్య' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని ఆశ పడితే అనూహ్యంగా డిజాస్టర్ గా నిలిచి దర్శకుడు కొరటాల శివకు చుక్కలు చూపిస్తోంది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీని అత్యధిక రేట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన సినిమా కావడం, అపజయమే ఎరుగని దర్శకుడు కొరటాల చేసిన సినిమా కావడంతో బయ్యర్లు భారీ రేట్లు పెట్టి ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. అయితే సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోగా భారీ నష్టాలని డిస్ట్రిబ్యూటర్లకు తెచ్చిపెట్టింది. దీంతో తమని ఈ సమస్య నుంచి గట్టెక్కించమని బయ్యర్లు కొరటాల చుట్టూ తిరగడం మొదలు పెట్టారు.
ఇటీవలే ఈ మూవీని సీడెడ్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన బయ్యర్లకు 4.7 కోట్లు నెల రోజుల్లో సెటిల్ చేస్తానంటూ దర్శకుడు కొరటాల శివ హామీ పత్రాన్ని అందజేశారట. దీంతో సమస్య తీరినట్టేనని అంతా ఊపరి పీల్చుకున్నారు. కొరటాల కూడా రిలాక్స్ అయ్యారు.
అయితే అనూహ్యంగా ఆయనకు మరో షాక్ తగిలినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ శాటిలైట్ హక్కుల్ని 15 కోట్లకు ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ జెమినీ టీవి సొంతం చేసుకుంది. కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారట.
అయితే ఉన్నట్టుండి డీల్ ని క్యాన్సిల్ చేసుకోవాలనే ఆలోచనలో సదరు సంస్థ వున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది దర్శకుడు కొరటాల శివకు బిగ్ షాక్ గా చెబుతున్నారు. ముందు అనుకున్న రేట్ ని తగ్గించి అగ్రిమెంట్ ని తిరిగి రాసుకుందామని, అలా కుదరని పక్షంలో అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకోవాలని సదరు సంస్థ తాజాగా కొరటాలకు చెప్పినట్టుగా తెలిసింది. దీంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితికి చేరుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. 'ఆచార్య' కు సంబంధించిన ఫైనాన్షియల్ సమస్యల నుంచి త్వరగా బయటపడమని, ఆ తరువాతే స్టోరీ వింటానని ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివకు చెప్పేశారట. అంతే కాకుండా సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయానికి ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని కూడా చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.