Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం బిగ్ అప్ డేట్ రెడీ
By: Tupaki Desk | 10 March 2021 4:30 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లి తెరపై ఇప్పటికే బిగ్ బాస్ మొదటి సీజన్ తో మెప్పించాడు. చేసింది ఒక్క సీజన్ అయినా కూడా తనదైన ముద్రను వేసిన ఎన్టీఆర్ మళ్లీ బుల్లి తెరపై సందడికి సిద్దం అయ్యాడు. ఇప్పటికే ఎన్టీఆర్ హోస్ట్ గా జెమిని టీవీలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే కార్యక్రమం రాబోతుంది. గతంలో స్టార్ మాలో నాగార్జున మరియు చిరంజీవిలు హోస్ట్ లు గా వచ్చిన ఈ షో రేటింగ్ సరిగా లేదనే కారణంగా నిలిపి వేయడం జరిగింది. షో ఫార్మట్ ను కాస్త మార్చి ఎన్టీఆర్ హోస్ట్ గా జెమిని టీవీలో టెలికాస్ట్ కు సిద్దం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ షో అప్ డేట్ కోసం.. ఎప్పుడెప్పుడు ఈ షో ఆరంభం అవుతుందో తెలుసుకోవడం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సుదీర్ఘ ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను హోస్ట్ గా అధికారికంగా ప్రకటించేందుకు జెమిని టీవీ సమాయత్తం అవుతుంది. ఈనెల 13వ తారీకున ఎన్టీఆర్ తో మీడియా సమావేశం ఏర్పాటు చేయించి మరీ షో ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. అదే సమయంలో ప్రోమోలను కూడా వదలబోతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ప్రోమోలు చాలా బాగా వచ్చాయట. షో ప్రారంభంకు ముందు ఈ ప్రోమోలతో షో పై మరింత ఆసక్తి పెంచబోతున్నారు.
షో లో పార్టిసిపేట్ చేసేందుకు సిద్దంగా ఉండాలంటూ ప్రేక్షకులకు షో నిర్వాహకులు సూచించారు. అతి త్వరలోనే షో ప్రారంభం కాబోతున్నట్లుగా జెమిని టీవీ వర్గాల వారు చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగిసిన తర్వాత అంటూ ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. కనుక ఈ షో ఐపీఎల్ సీజన్ పూర్తి అయిన వెంటనే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పూర్తి క్లారిటీ ఈనెల 13న రాబోతుంది. కనుక నందమూరి అభిమానులు అంతా కూడా రెడీగా ఉండండి.