Begin typing your search above and press return to search.

కౌశల్‌ కు కాల్‌ చేశాం..ఆయనే రెస్పాండ్‌ కాలేదు

By:  Tupaki Desk   |   12 Oct 2018 9:39 AM GMT
కౌశల్‌ కు కాల్‌ చేశాం..ఆయనే రెస్పాండ్‌ కాలేదు
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విన్నర్‌ కౌశల్‌ ఆమద్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను విన్నర్‌ గా నిలిచిన తర్వాత తన తోటి పార్టిసిపెంట్స్‌ ఎవరు కూడా అభినందనలు తెలిపేందుకు కాల్‌ చేయలేదని, ఏ ఒక్కరు కూడా నన్ను అభినందించలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. షో పూర్తి అయిన తర్వాత ఏ ఒక్కరు కూడా నాతో టచ్‌ లో లేరు అంటూ ఆ ఇంటర్వ్యూలో కౌశల్‌ పేర్కొన్నాడు. తాజాగా ఆ విషయమై గీతా మాధురి ఎన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

కౌశల్‌ గారిని విన్నర్‌ గా ప్రకటించిన వెంటనే ఆయనకు కంగ్రాట్స్‌ చెప్పాను, ఆ తర్వాత కూడా కౌశల్‌ గారికి ఒకసారి కాల్‌ చేశాను. కౌశల్‌ గారి నెంబర్‌ ను నన్ను ఒకరు అడిగారు, ఆయన్ను అడిగిన తర్వాత నెంబర్‌ ఇవ్వాలనుకున్నాను. అందుకోసం ఆయన నెంబర్‌ కు కాల్‌ చేశాను, అప్పుడు నో రెస్పాన్స్‌. దాంతో వాట్సప్‌ లో వాయిస్‌ మెసేజ్‌ పెట్టాను. ఆ మెసేజ్‌ కు కౌశల్‌ గారి భార్య నీలిమ గారి నుండి రెస్పాన్స్‌ వచ్చింది. ఆయన నుండి ఇప్పటి వరకు నాకు రిటర్న్‌ కాల్‌ రాలేదు. ఇక బిగ్‌ బాస్‌ పార్టిసిపెంట్‌ భానుశ్రీ బర్త్‌ డే పార్టీకి అందరం పార్టిసిపెంట్స్‌ కలుసుకోవాలని భావించాం.

బర్త్‌ డే పార్టీకి పిలిచేందుకు భానుశ్రీ స్వయంగా కౌశల్‌ గారికి కాల్‌ చేసింది. కాని భాను కాల్‌ ను కౌశల్‌ రిసీవ్‌ చేసుకోలేదట. రెండు మూడు సార్లు ఆమె ప్రయత్నించినట్లుగా గీతా మాధురి చెప్పింది. ఇలా మేము కౌశల్‌ గారితో ఫోన్‌ లో టచ్‌ లో ఉండేందుకు ప్రయత్నించాం. కాని ఆయన మాత్రం మాకు అందుబాటులోకి రాలేదు అంటూ గీతామాధురి పేర్కొంది. తనపై కౌశల్‌ చేసిన విమర్శలను గీతా మాధురి లైట్‌ గా తీసుకున్నట్లుగా ప్రకటించింది.