Begin typing your search above and press return to search.
కింగ్ కి బిగ్ బాస్ తెచ్చెను తంటా!
By: Tupaki Desk | 8 July 2019 4:03 PM GMTకింగ్ నాగార్జున ఒకదాని వెంట ఒకటిగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే కథ విషయంలో ఎంతో ఆచి తూచి.. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయ్యాక.. పకడ్భందీ రిలీజ్ ప్లాన్ తో ముందుకెళుతున్నారు. ఆ కోవలోనే ఇద్దరు దర్శకుల్ని చాలా కాలం నాగార్జున వెయిట్ చేయించిన సంగతి తెలిసిందే.
ఇటీవలే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మధుడు 2 సెట్స్ కెళ్లింది. కేవలం రెండు మూడు నెలల్లోనే వేగంగా టాకీ పూర్తి చేసేశారు. దసరా బరిలో రిలీజ్ చేసేందుకు పక్కాగా ప్రణాళికను సిద్ధం చేశారు. కొంతకాలం వెయిట్ చేసినా రాహుల్ ఆ మేరకు సేఫ్ అయిపోయాడు. అయితే సోగ్గాడే చిన్ని నాయనా లాంటి బ్లాక్ బస్టర్ ని అందించిన కళ్యాణ్ కృష్ణ ఏకంగా రెండేళ్లు పైగానే వేచి చూస్తున్నాడు. అతడి వెయిటింగ్ ఫలించే రోజు ఎప్పుడు? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఈనెలలోనే `బంగార్రాజు` చిత్రాన్ని ప్రారంభించి సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తారని ఇప్పటికే వార్తలొచ్చాయి. కానీ అప్పటికి ఈ సినిమాని రెడీ చేయలేని సన్నివేశం నెలకొందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి ప్లాన్ రెడీ చేస్తుండగానే మధ్యలో బిగ్ బాస్ 3 సీజన్ హోస్టింగ్ కోసం నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ ప్రభావం బంగార్రాజుపై పడిందట. దాంతో షెడ్యూల్స్ ని కాస్త అటు జరిపి సమ్మర్ బరిలో బంగార్రాజు రిలీజయ్యేలా సెట్ చేస్తున్నారట. దీంతో కింగ్ సంక్రాంతి రేసు నుంచి సైడైపోయినట్టేనన్న మాటా వినిపిస్తోంది. మన్మధుడు2 అనుకున్నట్టే దసరాకి రిలీజవుతున్నా బంగార్రాజు మాత్రం సమ్మర్ వరకూ వెళ్లిపోయింది. మరోవైపు అక్కినేని కాంపౌండ్ నుంచి ఇంకేవైనా సినిమాలు 2020 సంక్రాంతికి రిలీజ్ బరిలో దిగుతాయా? అంటే చైతూ చేస్తున్న వెంకీ మామ .. కమ్ములతో సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నాయి. అఖిల్ సినిమా సంగతి పూర్తి క్లారిటీ లేదు. ఇక సంక్రాంతి బరిలో మహేష్ - బన్ని లాంటి స్టార్ల సినిమాలు ఉన్నాయి. రజనీకాంత్ సినిమాని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. నాగ్ ఇప్పటికి మిస్సయినట్టేనన్న మాట వినిపిస్తోంది.