Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ కు కొత్త కెప్టెన్ వచ్చాడు...
By: Tupaki Desk | 6 Sep 2019 4:40 AM GMTబిగ్ బాస్ ఈ వారం కొత్త కెప్టెన్ ని ఎన్నుకునే ప్రక్రియ గురువారం ఎపిసోడ్ లో సాగింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులు అందరూ కలిసి ఏకాభిప్రాయంతో కలిసి కెప్టెన్ టాస్క్ కు అర్హులైన ముగ్గురు సభ్యుల పేర్లు చెప్పాలని సూచించాడు. దీంతో అంతకముందు కెప్టెన్లు కావడంతో వరుణ్ - అలీ - శివజ్యోతి పోటీ నుంచి తప్పుకున్నారు. అలాగే జైల్లో ఉన్న రవి - రాహుల్ ని అనర్హులుగా నిర్ణయించారు. వీరితో పాటు కొత్తగా వచ్చిన శిల్పాని అనర్హులుగా ప్రకటించారు. ఇక ఈ ఆరుగురుని పక్కనబెట్టేస్తే మిగిలిన ఆరుగురిలో ఎక్కువ మంది బాబా భాస్కర్ - శ్రీముఖి - హిమజ పేర్లు చెప్పారు.
దీంతో కెప్టెన్ టాస్క్ లో ఈ ముగ్గురు పోటీ పడటానికి సిద్ధమయ్యారు. అయితే ఈ టాస్క్ కంటే ముందుగా జైల్లో ఉన్న రవి - రాహుల్ ని బిగ్ బాస్ విడుదల చేశారు. అనంతరం టాస్క్ మొదలైంది. అయితే ఈ టాస్క్ లో అనర్హులైన రవి - రాహుల్ - శిల్పాలని అర్హులైన ఒక్కొక్కరికి సాయం చేయాలని సూచించారు. దీంతో శిల్పా బాబా భాస్కర్ కు - రాహుల్ హిమజకు - రవి శ్రీముఖికు సాయం చేయడానికి ఫిక్స్ అయ్యారు.
ఇక తర్వాత టాస్క్ మొదలైంది. రాహుల్ - రవి - శిల్పాలు తలో బాక్సులో ఉంటే అందులో నచ్చని వారి బాక్సుల్లో మిగతా ఇంటి సభ్యులు ఇసుక వేయాలి. అలాగే కెప్టెన్ టాస్క్ కోసం పోటీపడే వారు తమ సాయం చేసే వారి దానిలో ఇసుక పడనివ్వకుండా చూసుకోవాలి. ఇలా చివరికి ఎవరి దానిలో ఇసుక తక్కువ ఉంటే వారే విన్నర్ అవుతారు. దీంతో ఈ టాస్క్ లో బాబా భాస్కర్ విజేతగా నిలిచి హౌస్ లో కొత్త కెప్టెన్ అయ్యారు. తొలివారం నుండి కెప్టెన్ అయ్యేందుకు గేమ్ ఆడుతున్న శ్రీముఖి ఈవారం కూడా అవకాశాన్ని కోల్పోవడంతో భావోద్వేగానికి గురైంది.
అయితే బాబా భాస్కర్ తనకు కెప్టెన్ పదవి వద్దు అని రాహుల్, వరుణ్‌లతో చెప్పాడు. ఎక్కువ పోరాడకుండానే తాను కెప్టెన్ అయ్యాను అని... అది తనకు నచ్చట్లేదని అన్నాడు. కాబట్టి కెప్టెన్ గా ఉండలేను అని చెప్పుకొచ్చాడు. కానీ మీ కోసం శిల్పా కూడా కష్టపడిందని కాబట్టి కెప్టెన్ గా ఉండాలని వరుణ్ కోరడంతో భాస్కర్ ఒప్పుకున్నాడు.