Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ 3: ఉన్నంతలో బెటర్ ఎపిసోడ్
By: Tupaki Desk | 30 Sep 2019 4:28 AM GMTబిగ్ బాస్ సీజన్ 3 పై అంతకంతకు విమర్శలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంట్లో ఆడే టాస్క్ లు పరమ బోరింగ్ గా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. అందులో టాస్క్ లు.. ఆటలు ఎందుకనో బోర్ కొట్టించడంతో కాస్త భరించాల్సొస్తోంది అన్న ఫీలింగ్ టీవీలు చూసేవాళ్లకు అనిపించింది. అయితే ఈ ఆదివారం ఎపిసోడ్ కొంతవరకూ రిలీఫ్. రకరకాలుగా ఈసారి రక్తి కట్టించారనే చెప్పాలి.
బిగ్ బాస్ గేమ్ మారింది. ఈసారి ఇచ్చిన రకరకాల టాస్క్ లను ఇంట్లో వాళ్లు బాగానే ఆడారనే చెప్పాలి. ఒక రకంగా రవి యాంకరింగ్ తో టీవీ చానెల్ ఎపిసోడ్ సీన్స్ అలరించాయి. జంటలుగా వచ్చి బాగానే అలరించారు. ఎవరి ట్యాలెంటును బట్టి వాళ్లకు టాస్క్ లు ఇవ్వడం బావుంది. శ్రీముఖి నాట్యం .. రాహుల్ గానం.. పునర్నవి సాంగ్ .. బాబా బాస్కర్ డ్యాన్స్ రియాలిటీ జడ్జింగ్.. ఇలా ప్రతిదీ అలరించాయి. అలీ రజా- వితిక మధ్య అనుమానపు పెళ్లాం అమాయకపు మొగుడు ఎపిసోడ్ ఆద్యంతం అలరించింది. ముఖ్యంగా అనుమానపు పెళ్లాంలాగా వితిక చక్కగానే ట్రై చేసింది. వరున్ తేజ్ ని రవి ఇంటర్వ్యూ చేయడం బావుంది. ఇక ఈ గేమ్ లో నల్లనయ్య మహేష్ ఎంతో స్పెషల్ అని ప్రూవైంది. ఉన్న మాటను ఉన్నదున్నట్టుగా మాట్లాడేస్తూ టాస్క్ లో డీసెంట్ గా దూసుకెళుతున్నాడనే చెప్పాలి. జ్యోతి హడావుడి మామూలే. ఇక ఇందులో ఎవరు ఎవరికి నచ్చుతారు ఎవరు ఎవరికి నచ్చరు.. ఎవరిని ఎలిమినేట్ చేయాలి అంటూ బిగ్ బాస్ టాస్క్ ఎండింగ్ ఆకట్టుకుంది. నామినేషన్లలో ఉన్న రవి- బాబా భాస్కర్ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటూ నాగ్ సస్పెన్స్ ని లీడ్ చేసి చివరికి రవిని ఎలిమినేట్ చేశారు. ఈ సంగతి చాలా ముందే రివీల్ అయిపోయింది కూడా.
ఇక ఎవరు ఎలిమినేట్ అయ్యారు అన్నదానికంటే ఈ వారం ఇంట్లో అద్భుతంగా రక్తి కట్టించడంలో పార్టిసిపెంట్స్ పనితనాన్ని మెచ్చుకుని తీరాలి. ఇకపోతే ఇంట్లో వాళ్ల ఇన్నర్ ట్యాలెంటును బట్టి ఈ స్క్రిప్టుల్ని బాగానే రాసారని.. లేదా వాళ్లకు వాళ్లే రాసుకున్నారని అనుకుంటే.. రాసినవాళ్లను మెచ్చుకోవాలి. ఇకపోతే ప్రతిరోజూ ఇంత ఇదిగా గేమ్ ని రక్తి కట్టించడం అన్నది ఉంటుందా? అన్నది చూడాలి.