Begin typing your search above and press return to search.

హౌస్ లో గొడవలన్నింటికి నేనే కారణం

By:  Tupaki Desk   |   13 Dec 2021 5:31 AM GMT
హౌస్ లో గొడవలన్నింటికి నేనే కారణం
X
బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 5 నుండి టాప్ 6 కంటెస్టెంట్‌ గా ఎలిమినేట్ అయిన కాజల్ కాస్త భారంగానే వెళ్లి పోయింది. టాప్ 6 వరకు ఆమె ఉంటుందని ఎవరు అనుకోలేదు. అనూహ్యంగా ఆమె ఇక్కడి వరకు రావడం చాలా పెద్ద విషయం అంటూ అభిమానులు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఇక కాజల్‌ ఎలిమినేట్‌ అయిన విషయం ను నాగార్జున ప్రకటించగానే కాస్త ఎమోషనల్‌ అయ్యింది. సన్నీ బాగా ఏడ్చేశాడు. కాజల్ మరియు సన్నీ ఇంకా మానస్ లు చాలా మంచి స్నేహితులు అయ్యారు. వారు హౌస్ లో చూపించిన స్నేహంకు చాలా మంది బయట కనెక్ట్‌ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత కాజల్ స్టేజ్ పై నాగార్జునతో మాట్లాడుతూ పలు విషయాలను గురించి ఆమె చెప్పుకొచ్చింది.

షన్నూ ఒక ఎలిమినేషన్ నామినేషన్‌ సమయంలో నువ్వు ఇంట్లోంచి వెళ్తే గొడవలు తగ్గుతాయని అన్నాడు. ఆ సమయంలో బాధ వేసింది అన్నది. అదే సమయంలో హౌస్ లో గొడవలు నా వల్ల జరిగాయి.. చాలా గొడవలకు నేను కారణం అన్నట్లుగా కాజల్‌ ఒప్పేసుకుంది. కాని ఏ గొడవ కూడా నేను కావాలని పెట్టలేదు అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. తాను బిగ్‌ బాస్ అంటే ఇష్టంతో వెళ్తాను.. ఆ ఇష్టంతోనే ఆడాను. ప్రతి టాస్క్ లో ది బెస్ట్‌ ఇచ్చేందుకు ప్రయత్నించాను అంటూ కాజల్‌ బయటకు వచ్చిన తర్వాత చెప్పుకొచ్చింది. ఇక ఇంటి సభ్యులతో స్టేజ్ పై నుండి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్‌ చెప్పింది. శ్రీరామ చంద్ర మరియు కాజల్ ల మద్య చాలా సందర్బాల్లో గొడవలు జరిగాయి. వారిద్దరి మద్య ఎప్పుడు కూడా సఖ్యత కనిపించలేదు.

కాజల్ ఎలిమినేట్ అయ్యి వెళ్లి పోతున్న సమయంలో శ్రీరామ్‌ కూడా ఫీల్‌ అయ్యాడని కనిపించింది. మొత్తానికి బిగ్‌ బాస్ సీజన్ 5 నుండి కాజల్‌ ఔట్ అయ్యింది. ఇప్పుడు హౌస్ లో షన్నూ.. సన్నీ.. సిరి.. శ్రీరామ్ మరియు మానస్ లు మాత్రమే ఉన్నారు. ఈ టాప్ 5 లో విన్నర్ సన్నీ.. షన్నూ మరియు శ్రీరామ్‌ ల్లో ఒకరు అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా షన్నూ మరియు సన్నీ అనే ప్రచారం మొదటి నుండి ఉంది కాని ఈమద్య కాలంలో షన్నూ వ్యవహరించిన తీరు ముఖ్యంగా సిరి పట్ల అతడు వ్యవహరిస్తున్న తీరును చాలా మంది తప్పుబడుతున్నారు. అందుకే సన్నీ కి విజేత అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ లో ఏం జరుగుతుందో చూడాలి.