Begin typing your search above and press return to search.

'బిగ్ బాస్ 5' నిర్వాహకులు ఆ విషయంలో తప్పు చేశారా..

By:  Tupaki Desk   |   28 Aug 2021 11:30 PM GMT
బిగ్ బాస్ 5 నిర్వాహకులు ఆ విషయంలో తప్పు చేశారా..
X
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన బిగెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో 'బిగ్ బాస్'.. ఇండియాలో కూడా సూపర్ సక్సెస్ అయింది. తెలుగులోకి మాత్రం కాస్త ఆలస్యంగా వచ్చింది. అయినప్పటికీ 'తెలుగు బిగ్ బాస్' టీవీ రంగంలో సంచలనం సృష్టించింది. ఇండియన్ స్మాల్ స్క్రీన్ పై అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకున్న రియాలిటీ షో గా రికార్డులు నమోదు చేసింది. ఇప్పటి వరకు నాలుగు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో, ఇప్పుడు 5వ సీజన్ కోసం సన్నద్ధం అయ్యింది.

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'బిగ్ బాస్-5'.. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. 'స్టార్ మా' వారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత సీజన్లకు మించి ఏర్పాట్లు చేసారని తెలుస్తోంది. 'బిగ్ బాస్' హోస్టుగా మరోసారి కింగ్ అక్కినేని నాగార్జున సందడి చేయనున్నారు. గత మూడు సీజన్లని విజయవంతంగా నడిపిన నాగ్.. బోర్ డమ్ కి బై బై అంటూ తనదైన శైలిలో అలరించడానికి రెడీ అయ్యారు.

ఇకపోతే ఇటీవల తెలుగు 'బిగ్ బాస్' ప్రారంభ తేదీతో పాటుగా ప్రసారం అయ్యే సమయాన్ని కూడా నిర్వాహకులు వెల్లడించారు. వచ్చే నెల 5న సాయంత్రం 6 గంటలకు కర్టెన్ రైజర్ ఈవెంట్ తో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్ ఎపిసోడ్స్ సోమవారం నుంచి శుక్రవారం ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు ఈ రియాలిటీ షో ప్రసారం అవుతుంది. నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్స్ శని ఆదివారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకే ఈ షో మొదలవుతుంది.

అయితే 'బిగ్ బాస్ 5' రెగ్యులర్ డేస్ లో టైమింగ్స్ గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. రాత్రి 10 గంటల టైమ్ స్లాట్ అంటే చాలా ఆలస్యమని.. ఇది టీఆర్పీ రేటింగ్స్‌ పై ప్రభావం చూపుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్స్ కు ఇబ్బంది లేనప్పటికీ.. మిగతా రోజుల్లో రేటింగ్స్ కష్టమే అని అంటున్నారు. అందులోను దీనికి పోటీగా జెమినీ టీవీలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షో కూడా టెలికాస్ట్ అవుతుంది. అందుకే టైమింగ్స్ చేంజ్ చేస్తే బెటర్ అని సూచిస్తున్నారు.

కాగా, తెలుగు 'బిగ్ బాస్ 5' టైమింగ్స్ విషయంలో ఈసారి బాలీవుడ్ బిగ్ బాస్ ని ఫాలో అయినట్లు అర్థం అవుతోంది. అక్కడ ఈ రియాలిటీ షో మీద వచ్చిన కంప్లెయింట్స్ దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని రాత్రి 10 గంటల తర్వాతే ప్రసారం చేస్తున్నారు. ఇప్పుడు తెలుగులో ఐదో సీజన్ కూడా అదే సమయాల్లో టెలికాస్ట్ కాబోతోంది. ఇదిలా ఉండగా 'బిగ్ బాస్ 5' మరో వారం రోజుల్లో ప్రారంభం అవుతుండగా.. నిర్వాహకులు ఊహించని షాక్ తగిలిందని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలిందని ఊహాగానాలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం అవన్నీ ఒట్టి పుకార్లే అని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ అందరికీ ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్ వేయించారని.. ఎవరికి వైరస్ సోకలేదని తెలిసింది. కింగ్ నాగ్ హోస్టింగ్ లో ముందుగా ప్లాన్ చేసుకున్నట్లుగానే 'బిగ్ బాస్' తెలుగు సీజన్-5 జరుగుతుందని సమాచారం. తెలుగు బుల్లితెర ఆడియన్స్ కి అసలైన మజాని పరిచయం చేసిన 'బిగ్ బాస్' ఈసారి ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.