Begin typing your search above and press return to search.
#BIGGBOSS5TELUGU E24 : తిండి లేక తిప్పలు.. లోబో కష్టాలు
By: Tupaki Desk | 29 Sep 2021 8:30 AM GMTసోమవారం ఎపిసోడ్ లో జరిగిన ఎలిమినేషన్ నామినేషన్ కు సంబంధించిన చర్చలు మంగళవారం ఎపిసోడ్ ప్రారంభంలో కూడా జరిగింది. యాంకర్ రవి వెళ్లి మాస్టర్ మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి సారి నాగార్జున గారు గుంట నక్క అనగానే అంతా కూడా నా వైపు చూస్తున్నారు. చాలా దరిద్రంగా ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నటరాజ్ మాస్టర్ రవికి గుంట నక్క అని పెట్టడమే కాకుండా ఇంట్లో ఉన్న ఇతర సభ్యులకు వివిధ రకాల జంతువుల పేర్లు పెట్టాడు. ఇప్పటికే నటరాజ్ మాస్టర్ పై ఇంటి సభ్యుల్లో మరియు ప్రేక్షకుల్లో అసంతృప్తి ఉంది. ఆయన ఈ వారం నామినేషన్ లో ఉన్నాడు కనుక ఖచ్చితంగా వెళ్లి పోయేది ఆయనే అంటూ నెటిజన్స్ భావిస్తున్నారు. ఈ వారంలో ఆయన ప్రవర్తన మరీ అతి అవుతుండటంతో ఇక ఆయన్ను వదిలించుకోవడం బెటర్ అన్నట్లుగా ప్రేక్షకులు అభిప్రాయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేషన్ లో సిల్లీ రీజన్ ఇచ్చావంటూ కాజల్ చాలా సీరియస్ గా రవిపై ఆవేశం వెల్లగక్కింది. ఫన్నీ వేలో వెనుక నుండి కొట్టిన దాన్ని నువ్వు సీరియస్ గా తీసుకున్నావు చూడు అంటూ నువ్వు నా ఫ్రెండ్ వి కాదు.. నాతో మాట్లాడకు అంటూ అతడు వచ్చిన సమయంలో అక్కడ నుండి వెళ్లి పోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా చర్చ జరుగుతూనే ఉంది.
తర్వాత రోజు టిఫిన్ చేస్తూ మళ్లీ కొందరు నామినేషన్స్ గురించి మాట్లాడితే కొందరు ఇతర విషయాల గురించి చర్చించుకున్నారు. శ్వేత దోష తింటున్న సమయంలో అక్కడే ఉన్న జెస్సీ మాట్లాడుతూ బిగ్ బాస్ ఒక్కసారి శ్వేతను తనకు జోడీగా ఇవ్వండి. ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ను ఇవ్వండి అంటూ కోరాడు. అందుకు శ్వేత నవ్వేస్తూ వద్దు బిగ్ బాస్ అంది. ఈ విషయం శని లేదా ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున తీయడం.. ఖచ్చితంగా ఇద్దరికి ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ని ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇంటి సభ్యులు అంతా బయట ఉన్న సమయంలో డోర్ లు క్లోజ్ చేసి ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు అన్ని కూడా స్టోర్ రూం ద్వారా తీసుకు వెళ్లారు. పండ్లు.. పాలతో సహా పూర్తిగా ఆహారం లేకుండా తీసుకు వెళ్లారు. బెడ్ రూమ్ ల్లో ఉన్న పండ్లతో సహా అన్నింటిని తీసుకు వెళ్లారు. ఆ తర్వాత కొందరు దాచుకున్న వాటిని తినేందుకు ప్రయత్నించినా కూడా బిగ్ బాస్ వాటిని కూడా బయటకు పంపించాల్సిందిగా బిగ్ బాస్ కెప్టెన్ జెస్సీని ఆదేశించాడు. దాంతో అందరి వద్ద ఉన్న పండ్లు మరియు ఇతర ఆహార పదార్థాలు అన్ని కూడా తీసుకు వెళ్లారు. ఆ తర్వాత గెలవాలంటే తగ్గాలి టాస్క్ ను ప్రకటించారు. ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు ఆహారం తీసుకోకుండా ఉండాలి. అలా ఆహారం తీసుకోకుండా బరువు తగ్గుతు ఉండాలి. బరువు తగ్గడం కోసం ముందుగానే ఇంటి సభ్యుల వెయిట్ ను వేయడం జరిగింది.
ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు అంతా ఇద్దరు ఇద్దరుగా జంటలుగా అయ్యారు. టాస్క్ ఏంటో చెప్పకుండా జంటలుగా అవ్వమనడంతో ఏదేదో ఊహించేసుకుని జంటలుగా అయ్యారు. ఇక బిగ్ బాస్ టాస్క్ ప్రకటించిన తర్వాత బరువు తగ్గేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు మొదలు పెట్టారు. టాస్క్ లో భాగంగా మద్య మద్యలో ఛాలెంజ్ లు వస్తూ ఉంటాయి. జోడీల్లో ఎవరు అయితే పవర్ రూమ్ ను యాక్సెస్ చేస్తారో వారు ప్రత్యర్థి గా ఒక జంటను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ జంట తో ఒక టాస్క్ ఆడాలి. ఆ టాస్క్ లో ఎవరు గెలిస్తే వారి బరువు 500 గ్రాములు తగ్గిస్తారు.. ఓడిపోయిన వారి బరువు పెంచుతారు. మొదటగా పవర్ రూమ్ ను యాక్సెస్ చేసిన నటరాజ్ మాస్టర్ తమకు ప్రత్యర్థిగా శ్రీరామ్ హమీదాల జోడీని ఎంపిక చేసుకోవడం జరిగింది. టాస్క్ లో భాగంగా బకిట్ లో బిగ్ బాస్ చెప్పిన వస్తువులను వారికి కేటాయించిన కేబిన్ లో వేయాల్సి ఉంటుంది. అందుకోసం వారు చేతులు ఉపయోగించరాదు. ఈ టాస్క్ లో శ్రీరామ్ హమీదాలు గెలిచారు. ప్రస్తుతం టాస్క్ లో శ్రీరామ్ హమీదాల జోడీ లీడ్ లో ఉన్నారు. లోబో మరియు నటరాజ్ మాస్టర్ లు కలిసి చాల ప్రయత్నాలు చేసినా కూడా టాస్క్ ను గెలవలేక పోయారు. ప్రత్యర్థిని ఎంపిక చేసుకోవడంలో నటరాజ్ మాస్టర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ విషయం ఆయనకు కూడా అర్థం అయ్యి కాస్త అసహనం వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ ఎవరు తినవద్దు అంటూ పదే పదే హెచ్చరించినా కూడా లోబో తిన్నాడు. దాంతో అందుకు బాధ్యుడిగా కెప్టెన్ కు శిక్ష విధించబోతున్నట్లుగా బుదవారం ప్రోమోలో చూపించారు.