Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU : ప్రోమోల మీద ఉన్న శ్రద్ద టాస్క్ ల మీద లేదా?

By:  Tupaki Desk   |   5 Oct 2021 4:30 AM GMT
#BIGGBOSS5TELUGU : ప్రోమోల మీద ఉన్న శ్రద్ద టాస్క్ ల మీద లేదా?
X
తెలుగు బిగ్‌ బాస్ అయిద వారంలోకి అడుగు పెట్టింది. ఈ నాలుగు వారలు కూడా షో చాలా నార్మల్ గా సాగింది. కర్టన్ రైజ్‌ ఎపిసోడ్ కు ఎప్పటిలాగే మంచి రేటింగ్‌ వచ్చింది. ఆ తర్వాత నుండి వీక్‌ డేస్ ఎపిసోడ్స్‌ కు వీకెండ్‌ ఎపిసోడ్స్ కు రేటింగ్‌ విషయంలో నిరాశ తప్పడం లేదు. వీక్ డేస్ తో పోల్చితే వీకెండ్స్ లో కాస్త పర్వాలేదు అన్నట్లుగా రేటింగ్‌ వస్తుంది. మరీ దారుణంగా వీక్‌ డేస్ లో రేటింగ్‌ నమోదు అవుతున్న నేపథ్యంలో స్టార్‌ మా మరియు బిగ్‌ బాస్ నిర్వాహకులు జుట్టు పీక్కుంటున్నట్లుగా తెలుస్తోంది. షో చూడటం కోసం ప్రోమోలను కట్‌ చేసే విషయంలో చాలా క్రియేటివిటీని చూపిస్తున్న క్రియేటివ్‌ టీమ్‌ ఆటలో ఆసక్తిని కలిగించేందుకు ఎందుకు ఆ క్రియేటివిటీని చూపించలేక పోతున్నారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రోమోలు చూసి ఎపిసోడ్స్ ను చూసే కొందరు కూడా ప్రోమోల్లో మ్యాటర్ చూపించినంత ఎపిసోడ్‌ లో ఉండటం లేదని వారు కూడా షో ను చూసేందుకు ఆసక్తి చూపడం లేదు అనేది టాక్‌.

నాగార్జున వచ్చే రెండు రోజుల టాస్క్ లు మరియు ఎలిమినేషన్ విధానం కూడా చాలా నార్మల్‌ గా ఉందని.. ఇంట్రెస్ట్‌ ను కలిగించడంలో నాగార్జునను క్రియేటివ్‌ టీమ్‌ వినియోగించుకోవడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 5 లో వీకెండ్‌ ఎపిసోడ్స్‌ ను కూడా క్రియేటివిట్ గా డిజైన్ చేయడం లేదు అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీక్‌ డేస్ అన్ని వారాలు కూడా ఒక ఫార్మట్‌ లో సాగుతోంది. సోమవారం ఎలిమినేషన్స్‌ కు నామినేషన్స్ కు జరుగుతుండగా మంగళవారం ఎపిసోడ్‌ లో కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్ మొదలు అవుతుంది. బుద వారం కూడా అదే టాస్క్ సాగుతుంది. గురు వారం నాటి టాస్క్ లో విజేత ఎవరు అనేది తేల్చి అదే రోజు ఎపిసోడ్ లో కెప్టెన్సీ పోటీదారుల మద్య పోటీ జరుగుతుంది. గురు వారం కొత్త కెప్టెన్ వస్తాడు. శుక్రవారం ఎపిసోడ్ లో వీక్‌ లో వరస్ట్‌ ఫెర్ఫార్మర్ ఎవరు అనే విషయాన్ని చర్చించి జైల్లో పెడతారు. ఆ రోజు ఏదో ఒక చిన్న టాస్క్ వేసి ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత శనివారం నాగార్జున వస్తారు. ఆదివారం ఎలిమినేషన్ ఉంటుంది. ఎలిమినేట్‌ అయిన వారు వెళ్లి స్టేజీ మీద మాట్లాడతారు. ఇలా షో సాగుతుంది.

వారం మొత్తం కూడా ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకులు ముందుగానే ఊహించేస్తే చూడ్డానికి ఏముంటుంది. టాస్క్ ల గురించి చూడాలి అంటే ఆ టాస్క్ లు పెద్దగా ఇంట్రెస్టింగ్‌ గా ఉండటం లేదు. ఇక కంటెస్టెంట్స్ విషయంలో కూడా నిరాశగానే ఉన్నారు. ఇంతగా బిగ్ బాస్ క్రియేటివ్‌ టీమ్‌ ప్రేక్షకుల నాడి తెలియకుండా షో ను నడిపిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బిగ్‌ బాస్‌ హౌస్‌ లో ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్‌ విషయాలు జరుగుతూనే ఉండాలి. అలా జరిగినప్పుడు మాత్రమే ప్రేక్షకులు రెగ్యులర్ గా షో ను చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కేవలం సోమవారం ఎపిసోడ్‌ నామినేషన్స్ ఉంటాయి కనుక చూస్తాం.. శని ఆది వారాల ఎపిసోడ్స్ లో నాగ్‌ వస్తున్నాడు కనుక చూస్తాం అన్నట్లుగా ప్రేక్షకులు భావిస్తున్నారు. వీక్‌ డేస్ లో ప్రేక్షకులను కట్టి పడేసేందుకు ప్రేక్షకులు మరేదైనా చేయాలని సూచిస్తున్నారు. అది ఏంటీ అనేది షో క్రియేటివ్‌ టీమ్‌ ఆలోచించాల్సిందే.