Begin typing your search above and press return to search.

Bigg Boss 6: సిరి వెంటవచ్చిన ఆ చిన్నోడు ఎవరో తెలుసా?

By:  Tupaki Desk   |   25 Nov 2022 12:30 PM GMT
Bigg Boss 6: సిరి వెంటవచ్చిన ఆ చిన్నోడు ఎవరో తెలుసా?
X
బిగ్ బాస్ 6 వ సీజన్ మళ్ళీ సరికొత్త ఎమోషన్స్ తో ముందుకు సాగుతోంది. మొత్తం ఫ్యామిలీ ఎపిసోడ్స్ అన్నిటికి కూడా మంచి రేటింగ్స్ వస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ అయితే ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ను ప్రత్యేకంగా రప్పిస్తూ ఊహించని సర్ ప్రైజ్ లు అయితే ఇస్తున్నాడు. అయితే ఇటీవల శ్రీహన్ కోసం సిరి హనుమంతు వచ్చిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ 5వ సీజన్ ద్వారా సిరి మంచి గుర్తింపు అందుకుంది.

అప్పట్లోనే ఆమె తనకు పుట్టలేదు కానీ ఒక కొడుకు మాత్రం ఉన్నాడు అని చాలా ఎమోషనల్ గా తెలియజేసింది. అయితే ఇప్పుడు అతనితోనే బిగ్ బాస్ 6వ సీజన్లోకి శ్రీహన్ కోసం అడుగు పెట్టింది.

ఇక ఆ చిన్న పిల్లవాడు రాగానే డాడీ అంటూ శ్రీహన్ ను హత్తుకున్నాడు. ఆ మూమెంట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే మొదటిసారి వీరిని చూసినవారు అయితే నిజంగా వారికి పుట్టిన బాబు అని అనుకుంటారు.

ఆ విధంగా వాళ్లతో ఆ పిల్లవాడు కలిసిపోయాడు. అయితే కొన్ని వెబ్ సైట్ లలో సిరి అతని దత్తతకు తీసుకుంది అని అతను ఒక అనాధ అని కూడా వార్తలు వచ్చాయి. కానీ నిజానికి అతని పేరు చైతన్య. అతను మరెవరో కాదు. సిరి హనుమంతు తమ్ముడి కి పుట్టిన బాబు. ఇక శ్రీహన్ జీవితంలోకి వచ్చిన తర్వాత అతనికి కూడా చైతన్య చాలా క్లోజ్ అయ్యాడు. ఎక్కువగా వారితోనే ఆ పిల్లవాడు కలిసి ఉంటున్నాడు.

అతని బాగోగులు అన్నీ కూడా సిరి దగ్గరుండి చూసుకుంటుంది. ఇక ఆ ఎమోషనల్ బాండింగ్ శ్రీహన్ కు కూడా బాగా దగ్గరయింది. దీంతో ఆ పిల్లవాడు ఇద్దరినీ అమ్మ నాన్న అంటూ ఎంతో ఆప్యాయంగా పెరుగుతూ వస్తున్నాడు.

ఇక హౌస్ లో మాత్రం శ్రీహాన్ సిరి డాన్స్ చేస్తూ ఉంటే చైతు చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఉండడం కూడా హైలైట్ గా నిలిచింది. ఏదేమైనా బిగ్ బాస్ లో మాత్రం విరిజంట చాలా హైలెట్గా నిలిచింది. ఇక బిగ్ బాస్ కప్పు కొట్టాలని శ్రీహన్ కు సిరి గట్టిగా చెప్పి బయటకు వెళ్లిపోయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.