Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 6 : అందరు కలిసి అతన్ని ఏడిపించారు..!

By:  Tupaki Desk   |   10 Nov 2022 8:30 AM GMT
బిగ్ బాస్ 6 : అందరు కలిసి అతన్ని ఏడిపించారు..!
X
ఓ పక్క బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ అయ్యే అర్హత స్ట్రాంగ్ కంటెస్టంట్ రేవంత్ కే ఉందని హడావిడి చేస్తుంటే.. మరోపక్క హౌస్ లో అతన్ని టార్గెట్ చేస్తూ హౌస్ మెట్స్ అంతా కూడా సూపర్ స్కెచ్ వేశారు. రేవంత్ ఆట ఆడుతున్నప్పుడు తన వేగాన్ని పెంచుతాడు. అంతేకాదు టాస్కుల్లో ఫిజికల్ అవడం అతని వీక్ నెస్. ఆల్రెడీ తను ఒక ఉన్మాదిగా ఆడుతున్నాడు అంటూ హోస్ట్ నాగార్జుననే ఎల్లో కార్డ్ ఇచ్చాడు. హౌస్ మెట్స్ కూడా రేవంత్ ఆట మీద ఫిజికల్ ఫిజికల్ అని పదే పదే అంటూ ఉన్నారు.

లేటెస్ట్ గా బిగ్ బాస్ హౌస్ లో కెప్టేన్సీ టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో స్నేక్, లాడర్స్ టీం లు పాల్గొన్నారు. వీళ్లిద్దరికి బిగ్ బాస్ నాగమణి టాస్క్ ఇచ్చాడు. ఇక టాస్క్ ఏదైనా రేవంత్ దూసుకెళ్లడం గ్యారెంటీ. ఈ టైం లో రేవంత్ ఫిజికల్ అవడంతో హౌస్ మెట్స్ అంతా అతనిపై ఎటాక్ కి దిగారు.

ముఖ్యంగా ఆది రెడ్డి, ఫైమాలు రేవంత్ తో మాటలతో పోట్లాడారు. టాస్కులో ఫిజికల్ అవడం కామన్.. మీకు చేతకాదా.. ఏం పీకుతారో పీక్కోండి.. ఇలాంటి మాటలు రేవంత్ మాట్లాడటం ఇబ్బందిని కలిగించింది. చివరగా తన టీం లో ఉన్న శ్రీ సత్య కూడా రేవంత్ పై గొడవేసుకుంది.

ఆ దెబ్బతో రేవంత్ సైలెంట్ అయ్యాడు. తానిక ఫిజికల్ టాస్క్ లు ఆడనని చెప్పాడు. ఈ టాస్క్ ఓ స్నేక్ టీం గెలవగా నిరుత్సాహ పడిన రేవంత్ తన భార్య ఫోటో చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బిగ్ బాస్ కి అనవసరంగా వచ్చానంటూ రేవంత్ ఆది రెడ్డితో అనడం హైలెట్ అని చెప్పొచ్చు.

ఆట ఆడటం వరకు ఓకే కానీ అవతల వాళ్లని ఇబ్బంది పెట్టేలా ఆట ఆడటం అన్నది కరెక్ట్ కాదు. టాస్కులు తప్ప మిగతా అంతా రేవంత్ బాగానే ఆడుతున్నా టాస్క్ వచ్చినప్పుడే పూనకం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు.

అసలే టైటిల్ రేసులో ఉన్న రేవంత్ ఈ టైం లో ఇలా ఎమోషనల్ అవడం అతని ఆట మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. రేవంత్ తన ఆట తీరుని కొద్దిగా మార్చుకుంటే మాత్రం అతను తప్పకుండా టైటిల్ విన్నర్ అవుతాడని చెప్పొచ్చు. రేవంత్ తర్వాత టైటిల్ రేసులో అంతగా ఎవరు కనిపించట్లేదు. అయితే ఎవరికి వారు తమ ఆట తీరుతో ఆడియన్స్ ని బుట్టలో వేసే ప్లాన్ లో ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.