Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ 6 : గేమ్ చేంజర్ గీతూ ఆట కట్టించిన రేవంత్
By: Tupaki Desk | 15 Sep 2022 5:28 AM GMTబిగ్ బాస్ 6 రెండవ వారం కెప్టెన్సీ పోటీదారుల సిసింద్రీ టాస్క్ హోరా హోరీ అన్నట్లుగా సాగింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ ఇచ్చిన బేబీ డాల్స్ ని కాపాడుకోవాల్సి ఉంటుంది. కానీ అశ్రద్దగా ఉన్న కారణంగా రేవంత్ డాల్ ని మెల్లగా వెళ్లి గీతూ రాయల్ లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో ఉంచేసింది. దాంతో ఆయన గేమ్ నుండి తప్పుకున్న విషయం తెల్సిందే. గీతూ మొదలు పెట్టిన ఆ గేమ్ ను కంటెస్టెంట్స్ అంతా కూడా కంటిన్యూ చేశారు.
రాత్రి నిద్ర పోకుండ మరీ గేమ్ లో కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎవరైనా పడుకుంటే వారి బొమ్మను తీసుకు వెళ్లి లాస్ట్ ఏరియాలో ఉంచారు. అలా శ్రీహాన్.. అర్జున్ లు కూడా ఎలిమినేట్ అయ్యారు. మొత్తానికి ఈ గేమ్ రసవత్తరంగా మారడంలో గీతూ రాయల్ కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. గేమ్ చేంజర్ గీతూ రాయల్ కూడా అనూహ్యంగా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.
గీత తన బొమ్మ ఎవ్వరికి దొరక్కుండా చాలా ప్రయత్నించింది. రకరకాల ప్రయత్నాలు చేసినా కూడా రేవంత్ దక్కించుకుని ఆ బొమ్మను లాస్ట్ ఏరియాలో ఉంచాడు.
దాంతో గీతూ కూడా గేమ్ నుండి బయటకు వెళ్లి పోయింది. తనను బయటకు పంపించిన గీతూను రేవంత్ బయటకు పంపించాడు.
ఇక కెప్టెన్సీ కంటెండర్స్ పోటీకి ఇనయా మరియు కీర్తిలు ఫిజికల్ టాస్క్ లో పోటీ పడ్డారు. ఆ టాస్క్ లో ఇనయా విజయం సాధించి ఒక కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచింది. అంతకు ముందే చంటీ కూడా కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచిన విషయం తెల్సిందే. రాజ్ మరియు సూర్య లు కెప్టెన్సీ పోటీదారుల మరో టాస్క్ లో విజయాన్ని సొంతం చేసుకున్నారు.
మొత్తంగా కెప్టెన్సీ పోటీలో పాల్గొనేందుకు చంటీ.. ఇనయా.. సూర్య మరియు రాజ్ లు అర్హత సాధించారు. వీరి మధ్య కెప్టెన్సీ పోరు ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పటిలాగే బిగ్ బాస్ 10వ రోజు కూడా ఆసక్తికరంగా షో జరిగింది. కంటెస్టెంట్స్ హోరా హోరీగా పోరాడుతూ ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ ను అందించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.