Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 6 : టైటిల్ విన్నర్ గెలుచుకునే ప్రైజ్ మనీ ఎంతంటే..!

By:  Tupaki Desk   |   14 Nov 2022 9:30 AM GMT
బిగ్ బాస్ 6 : టైటిల్ విన్నర్ గెలుచుకునే ప్రైజ్ మనీ ఎంతంటే..!
X
బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ఆడియన్స్ కి సూపర్ ఎంటర్టైనర్ గా మారింది. ఆ షో వచ్చే 105 రోజులు ఓ గంట పాటు టీవీలకు అతుక్కుపోతారు ప్రేక్షకులు బిగ్ బాస్ ఒక్కటే కాదు ఆ షో చూశాక వాటి రివ్యూస్ కూడా ఫాలో అవుతుంటారు. ప్రసతుతం బిగ్ బాస్ సీజన్ 6 10 వారాలు పూర్తి చేసుకుంది.

21మంది హౌస్ మెట్స్ తో మొదలైన సీజన్ 6 ప్రస్తుతం 10 మందితో నడుస్తుంది. లాస్ట్ వీక్ బాలాదిత్య, వాసంతి ఇద్దరి ఎలిమేషన్స్ తో హౌస్ మెట్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.

ఈ సీజన్ టైటిల్ విన్నర్ గెలుచుకునే మొత్తం ఎంత అన్నది ఆదివారం హోస్ట్ నాగార్జున రివీల్ చేశారు. ఈసారి విన్నర్ కి 50 లక్షలు ప్రైజ్ మనీ అందించనున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే కంటెస్టంట్స్ కి వారి ఇమేజ్ ని బట్టి వారాల లెక్క రెమ్యునరేషన్ ఇస్తుంటారు.

సెలబ్రిటీస్ అయితే మాత్రం వారు ఎన్ని రోజులు ఉన్నా మొత్తంగా రెమ్యునరేషన్ మాట్లాడేస్తారు. అయితే టైటిల్ విన్నర్ కి తన 105 రోజుల రెమ్యునరేషన్ తో పాటుగా 50 లక్షల ప్రైజ్ కూడా దక్కుతుంది.

లాస్ట్ సీజన్ లో క్యాష్ ప్రైజ్ తో పాటుగా సువర్ణభూమి వారి వెంచర్ లో ఒక ప్లాట్ కూడా ఇచ్చారు. లాస్ట్ సీజన్ లో రన్నరప్ కూడా కొంత ప్లాట్ ఇస్తామని సువర్ణభూమి యాజమాన్యం ప్రకటించారు. ఈ సీజన్ లో కూడా టైటిల్ విన్నర్ కి సువర్ణభూమి నుంచి అలాంటి గిఫ్ట్ ఏదైనా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కోసమే హౌస్ మెట్స్ అంతా కృషి చేస్తున్నారు. 100 రోజులు పైగా ఫ్యామిలీని.. కెరియర్ ని వదిలి పెట్టి ప్రతి ఒక్కరు టైటిల్ కొట్టాలనే కసి మీద వస్తారు. అయితే ఈ ప్రయాణంలో తమ ఆట తీరుతో ఆడియన్స్ ని మెప్పిస్తూ రావాల్సి ఉంటుంది.

వారం వారం నామినేషన్స్ లో ఉండి ఎలిమినేషన్స్ దాటుకుంటూ 100 రోజులు చేసే ప్రయాణం జీవితంలో మర్చిపోలేనిదిగా ఉంటుంది. బిగ్ బాస్ అనేది తెలుగు ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. అయితే ఇప్పటికీ ఆ షో నచ్చని వారు.. షోని చూడని వారు ఉన్నా సీజన్ సీజన్ కి కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది బిగ్ బాస్. నాగార్జున హోస్టింగ్.. బిగ్ బాస్ హౌస్ మెట్స్ ఇచ్చే టాస్కులు ఇవన్ని ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.