Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్: హౌస్‌ లో కంటెస్టంట్స్ అల్లరే అల్లరి...

By:  Tupaki Desk   |   17 Oct 2019 6:04 AM GMT
బిగ్‌ బాస్: హౌస్‌ లో కంటెస్టంట్స్ అల్లరే అల్లరి...
X
బిగ్ బాస్ బుధవారం ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఒక వైపు కంటెస్టంట్స్ అల్లరి... మరోవైపు కంటెస్టంట్స్ కు చెందిన బంధువులు రావడంతో షో ఎమోషనల్ గా సాగింది. బుధవారం ఎపిసోడ్లో మొదట అలీ భార్య మసుమ హౌస్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది. వీరి మధ్య ఫుల్ రొమాన్స్ - ఎమోషన్స్ నడిచాయి. ఆ తర్వాత శివజ్యోతి భర్త గంగులు ఇంటిలోకి వచ్చాడు. దీంతో జ్యోతి ఫుల్ గా కుళాయి తిప్పేసింది. బోరున ఏడుస్తూనే ఉంది. ఏడిస్తే వెళ్లిపోతానని గంగులు చెప్పడంతో అప్పుడు ఏడుపు ఆపింది. ఇక తర్వాత ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుని గేమ్ గురించి మాట్లాడుకున్నారు.

ఆ త‌ర్వాత వాళ్లిద్ద‌రు ప్రైవ‌సీ కోసం ప‌క్క రూమ్‌ లోకి వెళ్ల‌గా రాహుల్‌ - అలీ అక్కడ‌కు స్వీప‌ర్స్‌ గా వెళ్లి కావాల‌ని వారిని డిస్ట‌ర్బ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. చివ‌ర‌గా గంగులు వెళ్లిపోయెప్పుడు కూడా జ్యోతి బోరున ఏడ్చేసింది. ఈ కార్యక్రమం తర్వాత హౌస్ లో అసలు రచ్చ మొదలైంది. బిగ్ బాస్ ఇంటి సభ్యులని ఒకరి తర్వాత ఒకరిని ఫ్రీజ్ మోడ్ లో పెట్టారు. దీంతో మిగతా వారు వారికి షేవింగ్ ఫోమ్ - ఏవేవో క్రీములు రాసేశారు. అందరూ ఒకరికొకరు మొహం మొత్తం క్రీములు రాసేసుకున్నారు. అసలు ఫుల్ అల్లరి చేస్తూ ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేసి బాగా నవ్వించారు.

ఈ ఎంటర్ టైన్ మెంట్ తర్వాత ఇంటి సభ్యులని పవర్ సేవ్ మోడ్ లో ఉంచారు. ఈ సమయంలో బాబా భాస్కర్ ఇద్దరు పిల్లలు ఇంటిలోకి వచ్చారు. దీంతో బాబా ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలు కూడా అందరినీ పలకరించి - బాబాతో తమిళంలో ముచ్చట్లు పెట్టారు. అయితే మమ్మీ వచ్చిందా అని అడిగితే రాలేదని పిల్లలు సమాధానమిచ్చారు. కానీ హఠాత్తుగా బాబా భార్య రేవతి కూడా ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో బాబా ఎమోషనల్ గా ఆమెని హగ్ చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు.

ఇక ముగ్గురుని ఇంటి సభ్యులకు పరిచయం చేసి గేమ్ ఎలా ఆడుతున్నారని వారిని అడిగి తెలుసుకున్నారు. మళ్ళీ ఇంటి సభ్యులని పవర్ సేవ్ మోడ్ లో పెట్టి బాబా పిల్లలు - భార్యని బయటకు పంపారు. గురువారం ఎపిసోడ్లో కూడా మిగతా కంటెస్టంట్స్ బంధువులు రానున్నారు.