Begin typing your search above and press return to search.

ఆ సూసైడ్ బెదిరింపు ఖరీదు 16 లక్షలట

By:  Tupaki Desk   |   27 July 2017 5:00 PM GMT
ఆ సూసైడ్ బెదిరింపు ఖరీదు 16 లక్షలట
X
'బిగ్ బాస్' షోకు మొదట్లో సరైన రేటింగులు రాలేదేమో కాని.. ఒక వారం గడిచేపాటికి మాత్రం ఎక్కడలేని రేటింగులు వచ్చేశాయి. ఎన్టీఆర్ వారానికి ఓసారి కనడబడటం ఒక ఎసెట్ అయితే.. అసలు సిగరెట్ల కోసం శివబాలాజీ గొడవ పెట్టుకోవడం.. హౌస్ లో జ్యోతి పట్ల ఇతరులకు నెగెటివ్ ఫీలింగ్ రావడం.. ముమాయత్ ఖాన్ ఓవర్ యాక్షన్.. చివరకు సంపూర్ణేష్‌ బాబు భారీ ఓవర్ యాక్షన్ చేయడంతో మాంచి రేటింగులే వచ్చాయి.

నిజానికి ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు.. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు గాను రోజుకు ఇంత అంటూ సెలబ్రిటీలకు రెమ్యూనరేషన్ కూడా అందుతోంది. కాకపోతే బయటకు వెళ్ళిపోవాలంటే మాత్రం.. అది కేవలం బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయితే తప్పించి.. ఖచ్చితంగా ఎవరికి వారు మాత్రం వెళ్లకూడదు. అలా వెళ్లకుండా కాంట్రాక్ట్ కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నన్ను పంపకపోతే సూసైడ్ చేసుకుంటా అంటూ బెదిరించి సంపూర్ణేష్‌ బాబు బయటకు వెళ్ళిపోయాడు. అందుకు మనోడు కాంట్రాక్ట్ ఉల్లంఘించినట్లే కాబట్టి.. ఫైన్ కట్టాల్సిందేనట. మనోడు ఉన్న రోజులకూ.. ఇప్పుడు వెళిపోయిన దానికి లెక్కగట్టి.. మనోడ్ని ఒక 16 లక్షల ఫైన్ కట్టమనే ఛాన్సుందని టాక్ వినిపిస్తోంది.

అసలు చివరకు వరకు కనుక సంపూర్ణేష్‌ కొనసాగి ఉండుంటే.. గెలిచిన ప్రైజ్ మనీ సంగతేమో కాని.. ఏకంగా 60 రోజులు ఉంటే 60 లక్షలు.. 70 రోజులు ఉంటే 70 లక్షలు డబ్బులు వచ్చేవట. మరి అవన్నీ వదిలేసుకుని ఎందుకిలా మనోడు సడన్ గా బిగ్ బాస్ కు బ్రేకప్ చెప్పాశాడో మనోడికే తెలియాలి. ఏదేమైనా కూడా ఈ షో తాలూకు ప్రెజర్ తట్టుకోవడం అంత వీజీ కాదంటున్నారు విశ్లేషకులు.