Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 6 : ఫ్యామిలీ మెంబర్స్ రాకతో హౌస్ మెట్స్ హంగామా..!

By:  Tupaki Desk   |   24 Nov 2022 8:30 AM GMT
బిగ్ బాస్ 6 : ఫ్యామిలీ మెంబర్స్ రాకతో హౌస్ మెట్స్ హంగామా..!
X
బిగ్ బాస్ సీజన్ 6 లో 12వ వారం ఫ్యామిలీ టైం వచ్చేసింది. మూడు నెలలుగా తమ ఫ్యామిలీకి దూరంగా బిగ్ బాస్ హౌస్ లో ఉంటున్న కంటెస్టంట్స్ కి ఈ వారం ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీతో వారిని ఖుషి చేస్తుంది. మొదటగా ఆది రెడ్డి వైఫ్ కవిత రాగా ఆది రెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతేకాదు వారి పాప మొదటి బర్త్ డే బిగ్ బాస్ హౌస్ లో చేయాలనుకున్న ఆది రెడ్డి కోరికను నిజం చేశాడు బిగ్ బాస్. దానితో బిగ్ బాస్ ఐలవ్యూ జీవితాంతం రుణపడి ఉంటా అంటూ ఆది రెడ్డి ఎమోషనల్ అయ్యాడు.

ఆ తర్వాత రాజ్ మదర్ ఉమారాణి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. ఆమె రాకతో రాజ్ కూడా ఎమోషనల్ అయ్యాడు. హౌస్ మెట్స్ అంతా చాలా బాగా ఆడుతున్నారని. రాజ్ కూడా బాగా ఆడుతున్నారని ఆమె చెప్పారు. నెక్స్ట్ ఫైమా మదర్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు.

తనకు ఫైమా కూతురుగా కాదు ఒక కొడుకులా ఫ్యామిలీ ని సపోర్ట్ చేస్తుందని అన్నారు. హౌస్ లో అందరు ఆట బాగా ఆడుతున్నారని చెప్పారు ఫైమా మదర్. ఇక ఆ తర్వాత శ్రీ సత్య మదర్ ఫాదర్ ఇద్దరు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. వీల్ చెయిర్ తో శ్రీ సత్య మదర్ హౌస్ లోకి రావడం షాక్ ఇచ్చింది. ఆమె రాకతో శ్రీ సత్యకు కొన్ని ఓట్స్ ఎక్కువ పడేలా ఉన్నాయి.

బుధవారం ఎపిసోడ్ లో చివరగా రోహిత్ వాళ్ల మదర్ కూడా హౌస్ లోకి వచ్చారు. రోహిత్ ఆట గురించి ఇంకా హౌస్ మెట్స్ గురించి ఆమె అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక గురువారం ఎపిసోడ్ లో శ్రీహాన్ కోసం సిరి వస్తుంది. ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో రిలీజ్ చేశారు.

సీజన్ 5 కంటెస్టెంట్ అయిన సిరి మరోసారి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది. శ్రీహాన్ కోసం ఆమె వచ్చి హౌస్ అంతా తిరిగింది. ప్రతి హౌస్ మెట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే ఇన్ పుట్స్ ని అర్ధం చేసుకొని మిగతా రెండు వారాల ఆట ఆడనున్నారు. మూడు నెలల తర్వాత తమ ఫ్యామిలీ మెంబర్స్ ని చూసి ప్రతి ఒక్క కంటెస్టంట్ ఎమోషనల్ అయ్యారు. ఈ వీక్ బిగ్ బాస్ రేటింగ్స్ కూడా అదిరిపోయేలా ఉంటాయని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.