Begin typing your search above and press return to search.
బిగ్ బాస్: భయపడుతున్న సెలబ్రిటీలు!
By: Tupaki Desk | 8 Nov 2019 9:37 AM GMTబిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొంటే మంచి గుర్తింపు వస్తుందని.. కెరీర్ కు బూస్ట్ ఇస్తుందని ఒక అభిప్రాయం ఉంది. నిజానికి హిందీ బిగ్ బాస్ లో పాల్గొన్నవారిలో చాలా మందికి మంచి గుర్తింపు వచ్చింది.. బాలీవుడ్ లో అవకాశాలు కూడా దక్కాయి. అయితే తెలుగు బిగ్ బాస్ విషయంలో మాత్రం అలా జరగడం లేదని.. రివర్స్ లో జరుగుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది.
బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి తీసుకుంటే ఇప్పటివరకూ పాల్గొన్న పార్టిసిపెంట్స్ లో ఎవరికీ కెరీర్ పరంగా మేలు జరగలేదు. కొందరికి బిగ్ బాస్ షో టెలికాస్ట్ అవుతున్న సమయంలో గుర్తింపు దక్కింది కానీ అది ఎక్కువ కాలం కొనసాగలేదు. బిగ్ బాస్ ముగిసిన రెండు మూడు నెలలకే వారి పరిస్థితి ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టుగా ఉందని అంటున్నారు. బిగ్ బాస్ లో పాల్గొన్నందుకు బయట ప్రచారంలో ఉన్నట్టు భారీ రెమ్యూనరేషన్ దక్కలేదని పార్టిసిపెంట్లు ఓపెన్ గానే చెప్తున్నారు. నిజానికి బిగ్ బాస్ లో పాల్గొన్నందువల్ల లాభం సంగతి దేవుడెరుగు నష్టం జరుగుతోందని ఈమధ్య నందని రాయ్ చెప్పడం అందరికీ షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ లో పాల్గొనేందుకు చేతిలో ఉన్న సినిమాలను వదులుకున్నానని.. అయినా తనకు బిగ్ బాస్ వల్ల ఒరిగిందేమీ లేదని అంటోంది.
ఇలా బిగ్ బాస్ లో పాల్గొన్నవారు ఓపెన్ గా ఏం బెనిఫిట్ లేదని వెల్లడిస్తూ ఉండడంతో చాలామంది సెలబ్రిటీలు బిగ్ బాస్ కి వెళ్ళాలంటేనే భయపడుతున్నారట. బిగ్ బాస్ తర్వాత కొత్త అవకాశాలు రాకపోగా.. చేతిలో ఉన్న ఒకటీఅరా అవకాశాలు కూడా మిస్ అవుతుంటే సెలబ్రిటీలు భయపడడంలో ఆశ్చర్యం లేదు కదా?