Begin typing your search above and press return to search.
మలయాళం 'బిగ్ బాస్'కు చుక్కెదురు.. సస్పెన్షన్ విధించిన ప్రభుత్వం!
By: Tupaki Desk | 20 May 2021 8:30 AM GMTప్రస్తుతం మనదేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశంలో లాక్డౌన్ నడుస్తుంది. అలాగే అన్నివిధాలా బయట కార్యక్రమాలు - సినిమాకు - షూటింగ్స్ నిలిపివేయబడ్డాయి. కానీ ఇటీవల కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కేరళలో అత్యంత ప్రాచుర్యం రియాలిటీ షో మలయాళం బిగ్ బాస్ 3 షూటింగ్ నిలిపివేయబడింది. రియాలిటీ షో చిత్రీకరణ చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇప్పటికే షోలో సిబ్బందిలో ఆరుగురు సాంకేతిక నిపుణులు కరోనా వైరస్ బారినపడినప్పటికి షూటింగ్ కొనసాగించడంతో తమిళనాడు పోలీసులు అధికారులు తాజాగా బిగ్ బాస్ ఇంటికి సీలు వేశారు.
తాజా నివేదికల ప్రకారం.. షూటింగ్ సెట్లో కరోనా కేసులు పెరిగినప్పటికీ రియాలిటీ షో షూటింగ్ కంటిన్యూ చేశారు. అందుకే బిగ్ బాస్ మలయాళం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఇన్ఫర్మేషన్ అందడంతో వెంటనే స్పందించిన అధికారులు బిగ్ బాస్ మలయాళం హౌస్ కు తాళాలు వేసి కంటెస్టెంట్ లను హోటల్ కు షిఫ్ట్ చేశారు. తమిళనాడులో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నందున బిగ్ బాస్ మలయాళం 3 షోను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. నిజానికి మలయాళం బిగ్ బాస్ షో చెన్నైలో సెట్ వేసి నిర్వహిస్తున్నారు. కోవిడ్ -19 కేసులు గణనీయంగా పెరగడంతో తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో కఠినమైన లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ సమయంలో సినిమా - టీవీ షూటింగులు అనుమతించబడవు. పరిస్థితి మెరుగుపడిన తర్వాత బిగ్ బాస్ షో కొనసాగుతుందని మలయాళం సిబ్బంది స్పష్టం చేసింది.
ఇటీవలే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఇఎఫ్ఎస్ఐ) అధ్యక్షుడు ఆర్కె సెల్వమణి కూడా తమిళనాడులో సినిమాలు, సీరియల్ షూటింగ్స్ మే 31 వరకు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కొన్ని వారాల క్రితమే.. హోస్ట్ మోహన్ లాల్ ఈ షోను మరో 2 వారాలు పొడిగించనున్నట్లు తెలిపారు. ఇప్పుడు షో తాత్కాలికంగా నిలిపివేయబడింది. కాబట్టి ఛానెల్ ప్రోగ్రాం తిరిగి ప్రారంభించగలదా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. వీలైనంత త్వరగా బిగ్ బాస్ ఫైనల్ నిర్వహించాలని భావించారట. బిగ్ బాస్ ఇప్పటికే 90 రోజులకు పైగా పూర్తయింది. బిగ్ బాస్ మలయాళ బృందం చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో షూటింగ్ జరిపింది. కానీ ఇప్పుడు తాళం వేయబడింది. ఈవీపీ స్టూడియోలోని సెట్ బుధవారం తమిళనాడు పోలీసులు, ఆరోగ్య శాఖ సందర్శించారు. అనంతరం సెట్ కు తాళాలు వేసేసారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం అయింది.