Begin typing your search above and press return to search.

#BBః హిందీ ప్రయోగం తెలుగులో కూడానా!

By:  Tupaki Desk   |   26 Aug 2021 1:30 AM GMT
#BBః హిందీ ప్రయోగం తెలుగులో కూడానా!
X
హిందీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న బిగ్ బాస్ ను గత నాలుగు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకు వస్తున్నారు. ఇప్పటి వరకు స్టార్‌ మా లో ప్రసారం అవుతున్న బిగ్‌ బాస్‌ నాలుగు సీజన్ లు పూర్తి చేసుకుంది. ఈ నాలుగు సీజన్ లు కూడా మంచి రేటింగ్‌ ను దక్కించుకున్నాయి. కనుక కరోనా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నా.. అనేక విధాలుగా ఇబ్బందులు ఉన్నా కూడా బిగ్‌ బాస్ ను నిలిపి వేయకుండా కంటిన్యూ చేస్తున్నారు. ప్రతి సీజన్ కూడా చాలా ముఖ్యం అన్నట్లుగా ఈ ఏడాది సీజన్ ను కూడా నిర్వాహకులు నిర్వహించేందుకు సిద్దం అయ్యారు. తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 5 ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఏ క్షణంలో అయినా టెలికాస్ట్‌ డేట్‌ ను ప్రకటించే అవకాశం ఉంది.

బిగ్‌ బాస్ హిందీ వర్షన్ ఇన్ని సంవత్సరాలుగా కూడా కేవలం బుల్లి తెరపై మాత్రమే వచ్చింది. కాని ఇప్పుడు ఓటీటీ వేదికగా మరో వర్షన్‌ బిగ్‌ బాస్ ను తీసుకు వస్తున్నారు. హిందీ ఓటీటీ బిగ్‌ బాస్ కు కరణ్‌ జోహార్‌ హోస్టింగ్‌ చేస్తున్నాడు. ఎప్పటిలాగే సల్మాన్ ఖాన్‌ హోస్ట్‌ గా బిగ్ బాస్ ఉండబోతుంది. హిందీ లో ఎలా అయితే ఓటీటీ బిగ్‌ బాస్ ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారో అలాగే తెలుగు లో కూడా బిగ్ బాస్‌ ను ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేస్తారనే టాక్‌ వినిపిస్తుంది. సాదారణంగా బిగ్ బాస్‌ ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. కాని టీవీలో ఏది అయితే ఎడిటెడ్ వర్షన్‌ ప్రసారం అవుతుందో అదే ఓటీటీ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.

కొత్త పద్దతి ప్రకారం షో కు సంబంధించిన 24 గంటల స్టఫ్‌ ను అంటే లైవ్‌ ను ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేస్తూ ఉంటారు. ప్రతి నిమిషం ప్రతి సెకను కూడా అందులో చూడవచ్చు. తెలుగు లో కూడా ఆ ప్రయోగాన్ని ఓటీటీ ద్వారా చేయాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. వీలు ఉంటే ఈ సీజన్ లేదా వచ్చే సీజన్‌ నుండి ఈ ప్రయోగంను అమలు చేస్తారని తెలుస్తోంది. తెలుగు బిగ్‌ బాస్‌ రెగ్యులర్ సీజన్ 5 కు నాగార్జున హోస్ట్‌ గా వ్యవహరించబోతున్నాడు.. హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. మరి ఓటీటీ బిగ్‌ బాస్ ఏ ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.. అలాగే హోస్ట్ గా ఎవరు ఉంటారు అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.