Begin typing your search above and press return to search.
తెలుగులో బిగ్ బాస్ - OTT ప్లాన్ వర్కవుటవుతుందా?
By: Tupaki Desk | 21 Sep 2021 2:30 AM GMTరియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు నాట ఎంత హంగామా సృష్టిస్తోందో తెలిసినదే. ఇప్పటికే నాలుగు సీజన్లను దిగ్విజయంగా పూర్తిచేసుకుని...ఐదవ సీజన్ రన్నింగ్ లో ఉంది. ఈ షో మా టీవీ టీఆర్పీ రేటింగ్ ని అమాంతం పెంచేసింది. టెలివిజన్ రంగంలో ప్రధాన పోటీ ఉన్న ఛానళ్లకు సవాల్ గా మారింది. అయితే దానికి తగ్గ ప్లానింగ్ వర్కవుటవుతోంది. తాజా సీజన్ లో టాలీవుడ్ బిగ్ స్టార్స్ హోస్ట్ లుగా వ్యవహరించడం సక్సెస్ లో కీలక భాగమని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ కి కూడా నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. 2022 ఫిబ్రవరిలో ఈ వెర్షన్ ని లాంచ్ చేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఇది ఆరు వారాల పాటు కొనసాగుతుంది. ఇందులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. ఓటీటీ వెర్షన్ లో ఫైనల్ కు చేరుకున్న ఒకర్ని నేరుగా బిగ్ బాస్ సీజన్-6కి ప్రమోట్ చేస్తారు. ఓటీటీ వెర్షన్ కు ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్..నిర్వాహకులకు కాసుల పంట కూడా పండనుంది. అయితే ఇది కేవలం డిస్నీ హాట్ స్టార్ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఇదే ఫార్ములాతో హిందీలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఆ స్ఫూర్తితోనే తెలుగులోనూ లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
హిందీ వెర్షన్ ఆగస్టులో ప్రారంభమై నిన్నటితో పూర్తయింది. దివ్య అగర్వాల్ ఓటీటీ వెర్షన్ విజేతగా నిలిచింది. ఆమె 25 లక్షలు గెలచుకున్నారు. కరణ్ జోహార్ దీనికి హోస్ట్ గా వ్యవహరించారు. మరి తెలుగు వెర్షన్ ఓటీటీకి హోస్ట్ గా ఎవరిని ఎంపిక చేస్తారు? అన్నది చూడాలి. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ -5కి నాగార్జున హోస్ట్ గా ఉన్న సంగతి తెలిసిందే. సీజన్ -6 వచ్చే ఏడాది ఉంటుంది. ఆ షోకు హోస్ట్ మారే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఓటీటీ కూడా వస్తుంది కాబట్టి సీజన్-6 పై అంచనాలు పీక్స్ కి చేరడం ఖాయం.