Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ లేడీ కంటెస్టెంట్‌ 'కమిట్మెంట్‌'

By:  Tupaki Desk   |   16 Nov 2020 10:30 AM GMT
బిగ్‌ బాస్‌ లేడీ కంటెస్టెంట్‌ కమిట్మెంట్‌
X
తెలుగులో వెబ్‌ సిరీస్ ల జోరు మొదలైంది. వరుసగా స్టార్స్‌ నుండి చిన్న నటీనటుల వరకు అంతా కూడా ఓటీటీ కంటెంట్‌ పై ఆసక్తి చూపుతున్నారు. నటిగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ తేజస్వి బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 లో సందడి చేసింది. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో నటించని ఈమె బుల్లి తెరపై కనిపిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఈమె ఓటీటీ కంటెంట్‌ పై దృష్టి పెట్టింది. ప్రముఖ ఓటీటీ కోసం ఈమె నటించిన 'కమిట్మెంట్‌' వెబ్‌ మూవీ టీజర్‌ ను ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించింది.

సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్‌ అంటే మరో అర్థం ఉంటుంది. ఈ టైటిల్‌ తో తేజస్వి సినిమా చేయడం వల్ల ఖచ్చితంగా ఏదో వివాదాస్పద టాపిక్‌ ను ఈమె ఎంపిక చేసుకుని ఉంటుందని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి సంబంధించిన విషయాలను తన సినిమాలో చూపించబోతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్‌ బాస్‌ తర్వాత అంతగా ఆఫర్లు రాని ఈ అమ్మడికి వచ్చిన కమిట్మెంట్‌ ఆఫర్‌ ఎంత వరకు సత్పలితాన్ని ఇచ్చింది అనే విషయం చూడాలి. ఈనెల 18న రాబోతున్న ఈ టీజర్‌ లో సినిమా విడుదల విషయమై క్లారిటీ ఇవ్వబోతున్నారు. అదే సమయంలో ఏ ఓటీటీలో రాబోతుందనే విషయంపై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్‌ నవాబ్స్‌ దర్శకుడు లక్ష్మికాంత్‌ చెన్న ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.