Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU : ఈ కుస్తీలేంటీ? బ్యాన్ చేయండి

By:  Tupaki Desk   |   16 Sep 2021 9:30 AM GMT
#BIGGBOSS5TELUGU : ఈ కుస్తీలేంటీ? బ్యాన్ చేయండి
X
తెలుగు బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలంటూ చాలా కాలంగానే డిమాండ్ వినిపిస్తుంది. హిందీ మరియు తమిళ బిగ్‌ బాస్ లకు కూడా నిరసనలు ప్రతి ఏడాది తప్పడం లేదు. ఎన్ని విమర్శలు వచ్చినా అవి పబ్లిసిటీ అన్నట్లుగా నిర్వాహకులు భావించి బిగ్ బాస్ ను కంటిన్యూ చేస్తున్నారు. మొన్నటికి మొన్న కామ్రేడ్ నారాయణ మాట్లాడుతూ బిగ్ బాస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. బూతుల షో ఇలాంటి షో చూడటం వల్ల సభ్యసమాజం తప్పుదోవ పడుతుంది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొందరు బిగ్ బాస్ చూసే వారిని కూడా తప్పుబడుతున్నారు. మొత్తానికి బిగ్ బాస్ కు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో అందరు కాకున్నా కొందరు అయినా వ్యతిరేకతతో ఉన్నారు. అయితే ఎక్కువ శాతం మంది మాత్రం బిగ్ బాస్ ను విపరీతంగా ఆధరిస్తున్నారు. అందుకే భారీగా రేటింగ్స్ దక్కుతున్నాయి.

బిగ్ బాస్ అంటే వ్యతిరేకత ఎప్పుడు కూడా ఉంటుంది. అయితే ఎప్పుడైనా షో లో ఏదైనా అనుచిత సంఘటన జరిగినా లేదా చెడుగా ఏమైనా జరిగినా కూడా అది మరింత సీరియస్ గా మారే అవకాశం ఉంటుంది. వ్యతిరేకత పెరిగిన సమయంలో అన్నపూర్ణ స్టూడియో ముందు కొందరు ఆందోళనకు దిగిన సందర్బాలు కూడా చాలా ఉన్నాయి. బిగ్‌ బాస్ హౌస్ లో ఈ వారం పంథం నీదా నాదా అనే టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ మల్లయుద్దం చేస్తున్నట్లుగా ఆడారు. ప్రతి ఒక్కరు కూడా కుస్తీ పట్టినట్లుగా ఒకరిని ఒకరు ఢీ కొట్టేందుకు ప్రయత్నించారు. ఎన్ని సార్లు ఇంట్లో ఫిజికల్‌ దాడులు చేసుకోకూడదు అంటూ చెప్పినా కూడా కంటెస్టెంట్స్ మాత్రం రక్తాలు కారుతున్నట్లుగా టాస్క్ లు చేస్తున్నారు.

ఆడ మగ అనే తేడా లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడేయడం.. ఒకరిపై ఒకరు పడటం నానా రచ్చ చేస్తున్నారు. దాంతో ఇలాంటి టాస్క్ లు ఏంటీ.. ఈ కేస్తీ పోటీలు ఏంటీ.. అసలు ప్రేక్షకులను ఏం చేయాలనుకుంటున్నారు.. సమాజం ఎటు వైపు వెళ్లాలనుకుంటున్నారు అంటూ చాలా సీరియస్ గా ఆందోళనకారులు బిగ్ బాస్ కు వ్యతిరేకంగా రచ్చ చేయడం మొదలు పెట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షో ఇది అనే విషయం మర్చిపోయి కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. చూపించేదే ఇంత అయితే చూపించని కంటెంట్‌ ఎంత అయ్యి ఉంటుంది అంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. విమర్శలు రాకుండా చాలా జాగ్రత్తగా కంటెంట్ ను కట్‌ చేసి ఇస్తారు. కాని కట్‌ లో పోయిన కంటెంట్‌ లో ఎన్ని బూతులు మరెన్ని దాడులు ప్రతి దాడులు ఉన్నాయో కదా అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.