Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్ లీక్ : ఆరవ వారంలో ఎలిమినేషన్ కి నామినేషన్స్ లో వీళ్లే

By:  Tupaki Desk   |   10 Oct 2022 10:30 AM GMT
బిగ్‌ బాస్ లీక్ : ఆరవ వారంలో ఎలిమినేషన్ కి నామినేషన్స్ లో వీళ్లే
X
తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 6 ఇప్పటికే అయిదు వారాలు పూర్తి చేసుకుని ఆరవ వారంలో అడుగు పెట్టింది. వారాలు గడుస్తున్నా కొద్ది స్ట్రాంగ్‌ ఎవరు.. వీక్ ఎవరు అనే విషయమై క్లారిటీ వస్తుంది. స్ట్రాంగ్‌ అనుకున్న చంటి అయిద వారం పూర్తి అయ్యేప్పటికి ఎలిమినేట్‌ అయ్యాడు. ఆయన ఎలిమినేట్‌ అయ్యి వెళ్తాడు అని అనుకోలేదు. కానీ ఆయన ఆట తీరుకు ప్రేక్షకుల నుండి అలాంటి స్పందన వచ్చింది.

ఇక ఆరవ వారంలో కూడా చాలా మంది వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే వారిలో కొందరు ఎలిమినేషన్‌ కి నామినేట్‌ అవ్వకుండా తప్పించుకుంటూ అదృష్టంతో బతికి పోతున్నారు. కొందరు మాత్రం స్ట్రాంగ్‌ అయినా కూడా దురదృష్టంతో ఎలిమినేట్‌ అవుతున్నాడు. సోమవారం ఎపిసోడ్‌ అంటే రచ్చ రచ్చ ఉంటుంది. ఈ సోమ వారం ఎపిసోడ్‌ కూడా ఆసక్తిగా ఉండబోతుంది.

సోమవారం ఎపిసోడ్‌ కు సంబంధించిన లీక్ ను రెగ్యులర్ గా మనం చూస్తున్నాం. ఈ వారం కూడా లీక్ అయ్యింది. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ లో ఉండబోతున్నారు అనే విషయంమై అప్పుడే బయటకు వచ్చింది. ఈ వారం మొహానికి తెల్లటి ఫోమ్‌ ను అంటిస్తూ ఒకొక్కరు ఇద్దరిని నామినేట్‌ చేయాల్సి ఉంటుంది.

ఈ వారం నామినేట్‌ అయిన వాళ్లలో ఇనాయా సుల్తానా... బాలాదిత్య.. ఆదిరెడ్డి... అర్జున్ కళ్యాణ్‌.. సుదీప.. కీర్తి భట్‌.. శ్రీహాన్‌.. గీతూ రాయల్ ఉన్నారు అంటూ లీక్ బయటకు వచ్చింది. అందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. నేడు రాత్రి ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ మాంచి రసవత్తరంగా సాగబోతుందని ఈ లీక్ ను బట్టి అర్థం అవుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.