Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ లీక్‌... విజేత ఎవరో కూడా తేలిపోయింది

By:  Tupaki Desk   |   17 Dec 2022 8:12 AM GMT
బిగ్‌ బాస్‌ లీక్‌... విజేత ఎవరో కూడా తేలిపోయింది
X
తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 6 ముగింపు దశకు వచ్చేసింది. రేపు గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్‌ అవ్వబోతుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన చిత్రీకరణ మొదలు అయ్యింది. నేడు మరియు రేపు షూటింగ్‌ లో నాగార్జున పాల్గొంటాడు. నేడు ఇద్దరు లేదా ముగ్గురు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారు. రేపటి ఎపిసోడ్‌ లో ఎవరు విజేత అనే విషయంలో ప్రకటించబోతున్నారు.

బిగ్‌ బాస్ సీజన్‌ 6 ఆరంభం నుండి కూడా ప్రతి వారం వారం ఎవరు ఎలిమినేట్‌ అవ్వబోతున్నారు అనే విషయాలు లీక్ అవుతూ వస్తున్నాయి. ఎవరు లీక్ చేస్తున్నారు... ఎలా లీక్ అవుతున్నాయి అనే విషయం పక్కన పెడితే లీక్ అయిన విషయం నూటికి నూరు శాతం నిజం అన్నట్లుగా తదుపరి రోజు అదే జరిగింది. ఇప్పుడు విజేత విషయంలో కూడా లీక్ వచ్చింది.

రేపటి ఎపిసోడ్‌ లో సింగర్‌ రేవంత్‌ ను బిగ్‌ బాస్ సీజన్‌ 6 యొక్క విజేతగా ప్రకటించబోతున్నారట. అంతే కాకుండా ప్రముఖ స్టార్‌ హీరో చేతుల మీదుగా రేవంత్ కు విన్నర్ ట్రోఫీని అందించబోతున్నట్లుగా తెలుస్తోంది. బిగ్‌ బాస్ సీజన్ 6 యొక్క విన్నర్ గా రేవంత్‌ నిలిస్తే రన్నర్ గా శ్రీహాన్ నిలువబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక మూడవ ప్లేస్ లో సామాన్యుడి కోటాలో హౌస్ లో అడుగు పెట్టిన ఆదిరెడ్డి నిలిచినట్లుగా తెలుస్తోంది. నాల్గవ స్థానంలో కీర్తి ఉండగా.. అయిదవ స్థానంలో రోహిత్‌ ఉన్నాడట. మొత్తానికి ఈ అయిదుగురు టాప్ 5 లో ఉండటంతో ప్రతి ఒక్కరు కూడా ఫుల్‌ హ్యాపీగా ఉండి ఉంటారు. విజేత ఒక్కడే కనుక అది ఎవరు అనేది మరింత క్లారిటీ రావడానికి రేపు సాయంత్రం వరకు వెయిట్‌ చేయాల్సిందే.

బిగ్‌ బాస్ సీజన్ 6 యొక్క విజేత రేవంత్‌ అంటూ ఇప్పటికే సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో షో పై కొందరికి ఆసక్తి తగ్గుతూ ఉంటే మరి కొందరు మాత్రం గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌ చూడటం కోసం వెయిట్ చేస్తున్నామని సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.