Begin typing your search above and press return to search.
హౌస్ మేట్స్ కి అవార్డ్స్ ఇచ్చిన నాగ్...ఆ ఇద్దరు సేఫ్
By: Tupaki Desk | 18 Aug 2019 5:39 AM GMTవారం రోజులు ఒక రేంజ్ లో సాగిన బిగ్ బాస్ షో శనివారం నాగార్జున ఎంట్రీ ఇవ్వడంతో ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ సాగింది. నాగార్జున ఇంటి సభ్యుల క్యారెక్టర్స్ కి తగ్గట్టుగా వారికి కొన్ని అవార్డులు ఇచ్చారు. ఒకవైపు పొగుడుతూనే..మరో వైపు వారికి చురకలంటించారు. ముందుగా బాబా భాస్కర్ కి బెస్ట్ కుక్కర్ అవార్డ్ అందించారు. ఆయన మంచి వాడిని అనిపించుకునేందుకు అన్నీ లోపల దాచుకుంటాడని, అదంతా బయటకి తీయాలని నాగ్ చెప్పగా, అలాంటి దేమి లేదని బాబా వివరణ ఇచ్చారు.
ఇక పునర్నవి బెస్ట్ అంపైర్ గా ఎంపికైంది. గేమ్‌లో ఆడకుండా ఎక్కువ చూస్తుందని ఈ అవార్డు ఇచ్చారని నాగ్ చెప్పగా, ఇక అలా జరగకుండా చూసుకుంటానని పునర్నవి చెప్పింది. ఇక బిగ్ మౌత్ అవార్డు.. రాహుల్ అందుకున్నారు. ముందు ఒకలా ఉండి వెనుక మరోలా ఉంటావని నాగ్ చెప్పి ఆ అవార్డ్ ఇచ్చారు. గట్టిగా అరుస్తుందని శ్రీముఖికి లౌడ్ స్పీకర్ అవార్డ్ ఇచ్చారు. ఆటలో అరటిపండు అవార్డ్ అషు రెడ్డి అందుకుంది. అగ్గి పుల్లలు పెట్టే అవార్డు.. మహేష్ విట్టా అందుకున్నాడు. కనపడకుండా ఇక్కడి విషయాలు అక్కడికి, అక్కడి విషయాలు ఇక్కడికి బాగానే పాస్ చేస్తావు అని చెప్పి నాగ్ ఆ అవార్డు ఇచ్చారు.
అన్నిటిని పెద్దగా చూస్తుందని బెస్ట్ బూతద్దం అవార్డ్ .. వితికా షెరు అందుకుంది. అలాగే ఎక్కువ ఏడుస్తున్న శివజ్యోతికి బెస్ట్ ఆనియన్ కట్టర్ అవార్డ్ అందుకుంది. గేమ్ లో ఊరికే మోసపోతున్నాడని వరుణ్ కు బెస్ట్ ఫ్రూట్ అవార్డ్ ఇచ్చారు. ఎక్కడిక్కడే మాటలు కట్ చేస్తుందని బెస్ట్ కత్తెర అవార్డ్ రోహిణి అందుకుంది. అలాగే అన్నీ ఓపికగా వింటాడని బెస్ట్ ఇయర్( చెవి) అవార్డుని రవిక్రిష్ణ అందుకున్నాడు.
మొత్తానికి సందడిగా సాగిన అవార్డుల కార్యక్రమం తర్వాత శివ జ్యోతితో పాటు వరుణ్‌ని సేఫ్ జోన్‌లోకి పంపిన నాగార్జున ఈ రోజు ఒకరిని ఇంటి నుండి పంపించనున్నారు. ఇంకా ఎలిమినేషన్ లో రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, రవి, రోహిణిలు ఉన్నారు.