Begin typing your search above and press return to search.
తెలుగు బిగ్ బాస్ పాత కంటెస్టెంట్స్ కనుమరుగవ్వడానికి కారణం ఇదే!
By: Tupaki Desk | 12 Nov 2020 12:30 AM GMTహిందీ బిగ్ బాస్ లో రెండు మూడు వారాలు కనిపించినా కూడా వారికి ఆ తర్వాత మంచి ఆధరణ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు.. బుల్లి తెరపై లేదా వివిధ మార్గాల్లో వారికి ఛాన్స్ లు వెదుక్కుంటూ వస్తాయి. కాని తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. స్టార్ మారిపోవడం తర్వాత సంగతి ఉన్న స్టార్ కూడా ఉడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివ బాలాజీ అంతకు ముందు చిన్నా చితకా సినిమాలు చేస్తూ ఉండేవాడు. కాని ఎప్పుడైతే బిగ్ బాస్ వెళ్లి వచ్చాడో ఆయన మళ్లీ సినిమాల్లో ఎక్కువగా కనిపించలేదు.
విన్నర్ లూజర్ ఎవరైనా కూడా బిగ్ బాస్ లో నుండి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయారు. తెలుగు బిగ్ బాస్ ద్వారా ఒక మోస్తరుగా లాభం పొందింది ఎవరు అంటే రాహుల్ అని చెప్పుకోవచ్చు. అంతకు ముందు వరకు పెద్దగా ఆఫర్లు లేని రాహుల్ కు బిగ్ బాస్ తర్వాత కాస్త గుర్తింపు వచ్చింది. అదే సమయంలో సెలబ్రెటీ హోదా పెరిగింది. ఇక మిగిలిన వారు అంతా కూడా తమకు సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్ ను బట్టి చూసుకుని తాము ఆహా ఓహో అనుకుంటూ తాము క్రితం ఏ పని అయితే చేసేవారో ఆ పనిని వదిలి పెట్టి ఈవెంట్ లు ఇతర కార్యక్రమాలు అంటూ తిరుగుతున్నారు. దాంతో వారి కెరీర్ ప్రమాదంలో పడుతుంది.
ఇలా చాలా మంది ఈవెంట్ లు అంటూ తిరిగి ఉన్న అవకాశాలు వదిలేసుకున్నారు. కొందరు మాత్రం బిగ్ బాస్ తో వచ్చిన సోషల్ మీడియా క్రేజ్ ను ఉపయోగించుకుని సోషల్ మీడియా ద్వారానే అంతో ఇంతో సంపాదించుకునేందుకు యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకోవడం లేదా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లతో ఆదాయం పొందడం వంటివి చేస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ వల్ల అతి తక్కువ మంది మాజీ కంటెస్టెంట్స్ మాత్రమే లాభం పొందుతున్నారు అనేది నగ్న సత్యం.