Begin typing your search above and press return to search.
టాప్ 5 అనుకుంటే 4 వారమే వెళ్లిపోతున్న సరయూ
By: Tupaki Desk | 27 March 2022 4:35 AM GMTబుల్లితెర దశను దిశను మార్చేసిన రియాలిటీ షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ మాత్రమే. బుల్లితెర మీద ఎన్నో ప్రయోగాలకు వేదికగా నిలవటమే కాదు.. భాష ఏదైనా భావం ఒక్కటే అన్నట్లుగా.. ఏ ప్రాంతంలో బిగ్ బాస్ షోను షురూ చేసినా.. విజయాన్ని సొంతం చేసుకోవటం దీని ప్రత్యేకతగా చెప్పాలి. ఈ మధ్యనే బిగ్ బాస్ సీజన్ 5 విజయవంతంగా పూర్తి కావటం.. దాని జోష్ నుంచి బయటకు రాక ముందే.. దాని అభిమానులకు ఫుల్ మీల్స్ అన్న రీతిలో ఓటీటీలో బిగ్ బాస్ నాన్ స్టాప్ లైవ్ స్ట్రీమింగ్ తో సాగుతోంది.
ఫిబ్రవరి 26న మొదలైన ఈ ఓటీటీ రియాల్టీ షోను 17 మందితో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. వీరిలో ముమైత్ ఖాన్.. శ్రీరాపాక.. ఆర్జే చైతూలు ఉన్నారు. నాలుగో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానికి లీకు వీరులు బయటపెట్టిన సమాచారం కాస్తంత కొత్తగా.. షాకింగ్ గా మారిందన్న మాట వినిపిస్తోంది.
ఎందుకంటే.. ఈ షోలో అంతగా పాపులర్ కాని అనిల్.. మిత్ర శర్మలలో ఎవరో ఒకరు బయటకు వెళతారని అందరూ అనుకుంటుంటే.. అందరి అంచనాలకు భిన్నంగా సరయూను ఎలిమినేట్ చేసినట్లుగా చెబుతున్నారు. సీజన్ 5లో హౌస్ లోకి అడుగు పెట్టి.. దుమ్ము రేపుతుందని భావిస్తే.. అందుకు భిన్నంగా మొదటి వారంలోనే తిరిగి వచ్చేయటం చాలామంది జీర్ణించుకోలేని పరిస్థితి. ఓటీటీ షోలో అయినా కనీసం ఆమె టాప్ 5లో నిలుస్తారని అంచనా వేశారు. అందుకు భిన్నంగా ఆమె.. నాలుగో వారమే బయటకు వచ్చేయనుండటం ఇప్పుడు కాస్తంత షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు.