Begin typing your search above and press return to search.

#బిగ్ బాస్ 4 .. ప్చ్! ఏడుపులు పెడ‌బొబ్బ‌లు గ్యారెంటీ!?

By:  Tupaki Desk   |   9 Sep 2020 7:50 AM GMT
#బిగ్ బాస్ 4 .. ప్చ్! ఏడుపులు పెడ‌బొబ్బ‌లు గ్యారెంటీ!?
X
పూర్తిగా పాశ్చాత్య సాంప్ర‌దాయానికి కేరాఫ్ అడ్రెస్ గా `బిగ్ బాస్` రియాలిటీ షోని చూడాల్సి ఉంటుంది. అలాంటి పాశ్చాత్య దోర‌ణి టీవీ షోలు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌డం లేదా ఎక్కించ‌డం అంటే ఆషామాషీ కాదు. సాంప్ర‌దాయ‌వాదులు ఎప్ప‌టిక‌ప్పుడు ఈ రియాలిటీ షోని ఉతికి ఆరేస్తున్నారు. మ‌రోవైపు ఒక సెక్ష‌న్ ఆడియెన్ ఎప్ప‌టికీ బిగ్ బాస్ చూసేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కేవ‌లం ఇది మాస్ కి ఒక సెక్ష‌న్ ఆడియెన్ కి మాత్రం బిగ్ బాస్ ఎక్కుతుండ‌డంతో అది జ‌బ‌ర్ధ‌స్త్ లాంటి షోల్ని కూడా టీఆర్పీల్లో బీటౌట్ చేసింద‌ని విశ్లేషిస్తుంటారు.

తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 4 మొద‌లైంది. కంటెస్టెంట్స్ ని హోస్ట్ నాగార్జున ప‌రిచ‌యం చేశారు. అయితే ఇందులో చాలా ముఖాలు మ‌న‌కు తెలియ‌నివేన‌న్న భావ‌న అయితే క‌లిగింది. పైగా తెలుగు మాట్లాడే కంటే హిందీ .. త‌మిళం మాట్లాడే ముఖాలే క‌నిపించ‌డం కూడా ఇర్రిటేట్ చేసే ఫ్యాక్ట‌ర్.

ఇప్ప‌టికే షో మొద‌ల‌య్యాక ఒక్కో ముఖాన్ని ప‌రిశీలించిన ఆడియెన్ ఇప్ప‌టికే పెద‌వి విరిచేశారు. వీళ్ల భాష క‌ల్చ‌ర్ ఏదీ ఎవ‌రికీ ఎక్క‌డం లేదు. పైగా మొద‌టి మూడు సీజ‌న్ల తో పోలిస్తే ఈసారి డిఫ‌రెంటుగా ఏం ఉంది? అన్న‌ది కూడా పెద్ద క్వ‌శ్చ‌న్ మార్క్ గా మారింది. మొదటి రోజు నామినేషన్ ప్రక్రియ అంటూ అంతా గందరగోళం గడిచింది. ఇక రెండో రోజు షో చూస్తే అది అసలు తెలుగు బిగ్‌బాసేనా? అన్న విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి.

కరాటే కళ్యాణి వర్సెస్ సుజాత... సూర్యకిరణ్ మోనాల్ అభిజీత్ మధ్య ఫైటింగులు.. వాగ్వాదాలు.. వెక్కి వెక్కి ఏడ్చే వ్య‌వ‌హారాలు ఇవ‌న్నీ చ‌క‌చ‌కా తెర‌పైకి వ‌చ్చేశాయి. కానీ ఇంత చేస్తున్నా ఇందులో ఇంకేదో మిస్స‌య్యిందే అన్న భావ‌న ఆడియెన్ ని వెంటాడుతోంది. ఏడుపులు పెడ‌బొబ్బ‌లు వెక్కిరింత‌లు ఓవ‌రాక్ష‌న్లు క‌వ్వింత‌ల‌తో బిగ్ బాస్ హిట్ట‌వుతుందా? అంటే కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.

ముఖ్యంగా తెర ఆద్యంతం ఏదో ఇంగ్లీష్ భాష‌ను విన‌డం లేదా త‌మిళ భాష‌ను విన‌డం చూస్తుంటే ఇది తెలుగు వారి నెత్తిన ప‌రాచికంలా అఘోరించింది! అన్న చ‌ర్చా మొద‌లైంది. మోనాల్... క‌రాటే క‌ల్యాణి .. సూర్య కిర‌ణ్‌.. అమ్మ రాజ‌శేఖ‌ర్ లాంటి వాళ్లు ఇప్ప‌టికి అత్తెస‌రు మార్కులే. మునుముందు ఇంకేమైనా ర‌క్తి క‌ట్టించే ఎపిసోడ్స్ వ‌స్తాయా? అన్న‌ది చూడాలి.

బిగ్‌బాస్ ఏమైనా నిద్ర‌పోతున్నారా? ఈ త‌మిళం మాట్లాడేవాళ్ల‌ను ఆపి కాస్త తెలుగు మాట్లాడేవాళ్ల‌తో ఏదైనా చేయొచ్చు క‌దా? అని ప్ర‌శ్నించే వాళ్లు ఉన్నారుర‌. ఇక సోషల్ మీడియాలో స్టార్ మా- బిగ్‌బాస్ వాళ్ల‌ను ఏకి పారేస్తున్నారు. ఆ చెత్త క‌య్యాలు.. పనికి రాని ఆట‌లతో ఎన్నాళ్ల‌ని? అంటూ తిట్టేవాళ్లు ఉన్నారు. ముఖ్యంగా తంబీల భాష మాత్రం యావ‌గింపుగా ఉంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.