Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ స్రవంతి.. ఘాటైన గ్లామర్ డోస్

By:  Tupaki Desk   |   18 Nov 2022 8:32 AM GMT
బిగ్ బాస్ స్రవంతి.. ఘాటైన గ్లామర్ డోస్
X
బిగ్ బాస్ ద్వారా క్రేజ్ అందుకున్న కొంతమంది నటీమణులు ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీగా మారుతున్నారు. ఒక విధంగా గెలిచిన వారి కంటే మిగతా వాళ్లే మంచి అవకాశాలు అందుకుంటున్నారు అని చెప్పవచ్చుమ్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో నిలదొక్కుకోవాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. అయితే ఇప్పుడున్న యాంకర్స్ కూడా దారిని మార్చుకుంటు గ్లామర్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఒకప్పుడు యాంకర్ అనగానే కేవలం మాటలతోనే ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు వారి అందాలతో కూడా యువతను ఎంతగానో అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో తన గ్లామర్ తో ఎక్కువగా గ్లామర్ డోస్ పెంచిన వారిలో స్రవంతి చోకరపు కూడా ఉంది. ఈ బ్యూటీ మొదట కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో కనిపించింది.

మొదటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునందుకోవాలి అని ఈ భామ అడుగులు వేస్తోంది. ఇక మొదట్లో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత టెలివిజన్ రంగంలోనే పలు కామెడీ షోలలో కూడా తన టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా జబర్దస్త్ లో కూడా అప్పుడప్పుడు కనిపించింది.

ఇక ఈ ఏడాది మొదట్లో వచ్చిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్లో ఆమె ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. దాని ద్వారా కొంత గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు స్రవంతి యాంకర్ గా కొనసాగుతూ గ్లామర్ డోస్ పెంచుతుంది. రీసెంట్ గా స్రవంతి చొక్కా తీసేసి ఎద అందాలతో మతిపోయేలా చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇప్పుడున్న గ్లామరస్ యాంకర్స్ లో ఈ బ్యూటీ కూడా పోటీ ఇవ్వడానికి ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమా ఈవెంట్స్ లో అలాగే కొన్ని టెలివిజన్ షోలలో మెరుస్తున్న స్రవంతి.. వెండి తెరపై కూడా తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరి ఈ బ్యూటీ కి రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.