Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ నుండి ఎలిమినేట్‌ అయిన తెల్లారే పెళ్లి

By:  Tupaki Desk   |   3 Sep 2018 4:58 PM GMT
బిగ్‌ బాస్‌ నుండి ఎలిమినేట్‌ అయిన తెల్లారే పెళ్లి
X
ప్రస్తుతం ఇండియన్‌ బుల్లి తెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న రియాల్టీ షో బిగ్‌ బాస్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత దశాద్ద కాలంలో హిందీ బిగ్‌బాస్‌ ఉత్తరాది ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇక గత సంవత్సరం నుండి తెలుగు మరియు తమిళ ప్రేక్షకులకు కూడా బిగ్‌బాస్‌ దగ్గర అయ్యాడు. బిగ్‌ బాస్‌ లోకి ఒక్కసారి అడుగు పెట్టిన పార్టిసిపెంట్‌ క్రేజ్‌ అమాంతం పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. తెలుగుతో పాటు - తమిళంలో కూడా ప్రస్తుతం రెండవ సీజన్‌ ప్రసారం అవుతుంది. రెండవ సీజన్‌ లో భాగంగా నిన్నటి ఆదివారం ఎపిసోడ్‌ లో డేనియల్‌ అన్నె పోప్‌ ఎలిమినేట్‌ అయ్యాడు.

తమిళంలో నటుడిగా గుర్తింపు దక్కించుకున్న డేనియల్‌ అన్నె చాలా కాలంగా డెనీషాతో ప్రేమలో ఉన్నాడు. డేనియల్‌ బిగ్‌ బాస్‌ హౌస్‌ లో ఉన్న సమయంలోనే అతడితో కలిసి డెనీషా ఒకసారి వచ్చి కలిసి వెళ్లడం కూడా జరిగింది. కొన్ని పరిస్థితుల కారణంగా డేనియల్‌ ఎలిమినేట్‌ అయిన తెల్లారే అంటే నేడు రిజిస్ట్రర్‌ ఆఫీస్‌ లో వివాహం చేసుకున్నాడు. తన వివాహంకు సంబంధించిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించిన డేనియల్‌ తన లవర్‌ తాజాగా తన భార్య అయ్యింది అంటూ ప్రకటించాడు. బిగ్‌ బాస్‌ పార్టిసిపెంట్‌ గా భారీ పబ్లిసిటీని క్రేజ్‌ ను దక్కించుకున్న డేనియల్‌ వివాహంకు వేలాది మంది సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

డేనియల్‌ ఆట తీరు మరియు అతడి ప్రవర్తనతో ఫైనల్‌ 5లో ఖచ్చితంగా ఉంటాడని తమిళ ప్రేక్షకులు భావించారు. కాని ఈమద్య కాలంలో కాస్త అతడు డల్‌ అయినట్లుగా అనిపించింది. దాంతో అతడికి ఓట్లు తగ్గాయి. ఇక ప్రేమ కారణంగానే డేనియల్‌ ఆటలో జోరు తగ్గిందని, అందుకే అతడు ఎలిమినేట్‌ అయ్యాడు అంటూ కూడా తమిళ జనాలు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేశారు. మొత్తానికి డేనియల్‌ అన్నె బిగ్‌ బాస్‌ నుండి ఎలిమినేట్‌ అయిన తెల్లారే తన ప్రేయసిని పెళ్లి చేసుకోవడం హాట్‌ టాపిక్‌ అయ్యింది.