Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్ హౌస్‌ కు ‘నివర్’​ ఎఫెక్ట్​..కంటెస్టెంట్ల తరలింపు!

By:  Tupaki Desk   |   27 Nov 2020 6:30 AM GMT
బిగ్‌ బాస్ హౌస్‌ కు ‘నివర్’​ ఎఫెక్ట్​..కంటెస్టెంట్ల తరలింపు!
X
నివర్ తుఫాన్​ తమిళనాడును అతలాకుతలం చేస్తున్నది. చెన్నైలోని పలు భవనాలు నీటమునిగాయి. అయితే ప్రస్తుతం తమిళనాడులో బిగ్​బాస్​ సీజన్​ 4 కొనసాగుతున్న విషయం తెలిసిందే. నివర్​ ఎఫెక్ట్​ బిగ్​ బాస్​ హౌస్​ మీద కూడా పడింది. బిగ్​ బాస్​ హౌస్ ​ను వరద ముంచెత్తినట్టు సమాచారం. ఇంటి సభ్యులు ఉంటున్న గదుల్లోకి వరద నీరు వచ్చేసిందట. వెంటనే అలర్టయిన బిగ్​ బాస్​ నిర్వాహకులు ఇంటి సభ్యులను అక్కడి నుంచి రహస్యంగా ఓ హోటల్ ​కు తరలించినట్టు సమాచారం.

నివర్​ ఎఫెక్ట్​ తో గత రెండురెండ్రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం రెడ్​ అలర్ట్ ప్రకటించింది. చెన్నైలోని పలు భవనాలు నీటమునిగాయి. విద్యుత్​ వ్యవస్థ స్తంభించింది. అయితే నివర్​ తాకిడి చెన్నైలోని బిగ్​ బాస్​ హౌస్ కి తాకిందట. దీంతో బిగ్ ​బాస్​ హౌస్​ నిర్వాహకులు తీవ్ర ఆందోళన చెందారట. భారీ వర్షాలకు చెంబారాబక్కమ్ డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో వరదనీరు బిగ్​ బాస్​ హౌస్​ లోకి వచ్చి చేరింది. అయితే ఇంటి సభ్యులను మాత్రం సేఫ్​గా ఓ ఫైవ్ ​స్టార్​ హోటల్​ కు తరలించారట.

అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా ఇంటి సభ్యుల కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లినట్టు సమాచారం. కంటెస్టెంట్లు ఒకరితో ఒకరు మాట్లాడకుండా వేర్వేరు వాహనాల్లో హోటల్​ కు తరలించారట. అనంతరం బిగ్​బాస్​ హౌస్​ లోని వరద నీటిని బయటకు తోడేశారు. గదులను శుభ్రపరిచారు. ఇందుకోసం దాదాపు నాలుగు గంటల సమయం పట్టిందట. అనంతరం ఇంటి సభ్యులను మళ్లీ హౌస్​ లోకి తీసుకొచ్చారు. ఈ విషయంపై బిగ్​ బాస్​ నిర్వాహకులు మాట్లాడుతూ.. బిగ్​ బాస్​ హౌస్​ లోకి నీళ్లే రాలేదని చెప్పుకొచ్చారు. కేవలం ఓ టాస్క్​ లో భాగంగానే తాము ఇంటి సభ్యులను హోటల్​ కు తీసుకెళ్లామని చెప్పడం గమనార్హం.