Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU : ఈసారి సిగరెట్‌ రాయుళ్లు వీళ్లే

By:  Tupaki Desk   |   8 Sep 2021 11:30 AM GMT
#BIGGBOSS5TELUGU : ఈసారి సిగరెట్‌ రాయుళ్లు వీళ్లే
X
బిగ్ బాస్ కు వెళ్లే వారికి మందు అందుబాటులో ఉండదు కాని.. రెగ్యులర్ గా సిగరెట్లు అలవాటు ఉన్న వారికి బిగ్ బాస్ టీమ్ వారు రెగ్యులర్ గా సిగరెట్లు పంపిస్తూ ఉంటారు. అందుకోసం స్మోకింగ్‌ ఏరియాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సీజన్ లో కూడా సిగరెట్లు తాగే వారు ఉంటారు. గత సీజన్ లో పలువురు మగవారు సిగరెట్లు తాగే వారు.. ఈసారి కూడా సిగరెట్లు తాగే వారు ఉన్నారు. అయితే ఈసారి సిగరెట్‌ రాయుళ్ల జాబితాలో ఆడవారు ఇద్దరు ఉండటం విశేషం. సరయు సిగరెట్ తాగుతుంది అంటే పెద్దగా ఆశ్చర్యం లేదు. ఆమె బాడీలాంగ్వేజ్ మరియు ఇతర విషయాల వల్ల ఆమె ను జనాలు ఇప్పటికే ఒక అంచనా వేయడం జరిగింది. ఆమె సిగరెట్ తాగుతుంది అంటే ఆశ్చర్యం లేదు. కాని షాకింగ్ గా హమీదా కూడా స్మోకింగ్‌ చేస్తూ కనిపించింది.

లోబో తో కలిసి వీరు ఇద్దరు కూడా స్మోకింగ్‌ జోన్‌ లో దమ్ము లాగడం బిగ్ బాస్ కెమెరా కంట పడింది. రెగ్యులర్‌ ఎపిసోడ్‌ లో లోబో మరియు సరయు మాత్రమే స్మోక్ చేస్తున్నట్లుగా చూపించారు. కాని అన్ సీన్ లో మాత్రం హమీదా కూడా సిగరెట్‌ తాగినట్లుగా చూపించడం జరిగింది. ముగ్గురు సిగరెట్‌ గుమ్ము గుప్పు మంటు లాగుతూ పిచ్చాపాటి మాట్లాడేసుకుంటూ ఉన్నారు. లోబో మరియు సరయులకు సిగరెట్ కంపెనీ బాగుంది. నిన్నటి ఎపిసోడ్‌ లో సిరి గురించి ఇద్దరు మాట్లాడుకుంటూ అలా అలా దమ్మే వేశారు. ఈ ముగ్గురు దమ్ము వేస్తున్న వీడియో సోషల్‌ మీడియా లో వైరల్ అవుతోంది.

అంత మంది మగవారు ఉన్నారు వారిలో కేవలం ఒక్కరికి మాత్రమే సిగరెట్‌ అలవాటు ఉంది. కాని ఉన్న అమ్మాయిల్లో ఇద్దరికి సిగరెట్ అలవాటు ఉండటం కాస్త విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. సరయు మరియు హమీదాలు సిగరెట్‌ స్మోక్ చేస్తున్న వీడియోలు నెట్టింట తెగ వైరల్‌అవుతున్నాయి. సిగరెట్‌ అలవాటు ఉన్నా ఇలాంటి చోట సిగరెట్లను మానేసి పద్దతిగా ఉంటే ప్రేక్షకుల ముందుకు హుందాగా ఉంటుందని కొందరు భావించి సిగరెట్ లు మానేసిన వారు ఉంటారు. కాని కొందరు మాత్రం ఈ కొన్ని రోజులకు మార్చుకోవాల్సిన అవసరం ఏంటీ అంటూ కంటిన్యూ చేస్తున్నారు.