Begin typing your search above and press return to search.
బిగ్‌బాస్ హౌస్ మేట్స్ మాస్క్ తీశారా...లేదా... ?
By: Tupaki Desk | 19 Aug 2019 4:35 AM GMTనాగార్జున ఎప్పుడు చెబుతున్నట్లే ఆదివారం బిగ్ బాస్ ఎపిసోడ్ 'సన్ డే ఫన్ డే' అన్నట్లుగానే సాగింది. హౌస్ మేట్స్ తో సరదాగా గేమ్ ఆడిస్తూనే...సీరియస్ గా హౌస్ మేట్స్ నిజాలు మాట్లాడుతూ ఆటని రక్తికట్టించారు. శనివారం ఎపిసోడ్ లో మాస్క్‌లు తొలగించుకుని మీరు మీలా ఉండాలని నాగార్జున సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. దాన్ని హౌస్ మేట్స్ ఎంతవరకూ పాటిస్తున్నారు వాళ్లు ఇంకా నటిస్తూ మాస్క్‌లతోనే నటిస్తున్నారో లేదో విషయాన్ని తెలుసుకోవడానికి బిగ్ బాస్ హౌస్‌ని కోర్టుగా మార్చేశారు.
ఈ సందర్భంగా ఎలిమినేషన్ జోన్ లో మిగిలి ఉన్న రోహిణి - రవి - బాబా భాస్కర్ - శ్రీముఖి - రాహుల్ లని దొషులుగా, శివజ్యోతి - వరుణ్ - అలీలని జడ్జిలుగా, వితిక - హిమజ - మహేశ్ - పునర్నవి - అషులని లాయర్లుగా నియమించారు. ఈ సందర్బంగా ఒకో లాయర్ ఒకో దోషి గురించి వ్యతిరేకంగా వాదించాలి. దానికి జడ్జిలు అంగీకరిస్తే ఎస్ అంటారు లేదంటే నో చెబుతారు. మొదటిగా బాబా భాస్కర్ హౌస్‌లో ఎందుకు ఉండకూడదో చెప్పాలని మహేష్ విట్టాను వాదించాల్సిందిగా నాగార్జున లాయర్ బాధ్యతలు అప్పగించారు.
ఇక బాధ్యతల్ని చేపట్టిన మహేష్.. బాబాకి తెలుగు రాదని, ఆయనకు ఇగో ప్రాబ్లమ్‌తో పాటు ఇంటికి వెళిపోదామని ఆయనకు ఉందంటూ చెప్పారు. అయితే మహేష్ వాదనల్ని అబ్జెక్ట్ చేస్తూ.. వీటికి నేను ఒప్పుకోను అంటూ బాబా భాస్కర్ సరదాగా ఆటపట్టించారు. ఇక జడ్జిలు ఇద్దరు వాదనలతో ఏకీభవించారు.
ఆ తర్వాత రాహుల్ దోషిగా , పునర్నవి లాయర్ గా నిలబడ్డారు. రాహుల్ టాస్క్‌లలో ఇంట్రస్ట్ పెట్టడు. ఎప్పుడూ నవ్వుతూ గేమ్‌ని సీరియస్‌గా ఆడడు. ఇంట్లో ఉన్నవి మొత్తం తినేస్తాడు అంటూ పునర్నవి వాదించింది. దీనికి రాహుల్ స్పందిస్తూ తన వాదనలని కూడా చెప్పాడు. నా మొహం కొంచెం నవ్వుతున్నట్లే ఉంటుంది. తను ముందు నుంచి అలాగే ఉంటానని చెప్పాడు. ఇక హౌస్ లో అంతా ప్రేమగా తినిపిస్తే తింటున్నాని అన్నాడు. వీరి వాదనలకు జడ్జిలు కూడా ఓకే చెప్పారు.
అనంతరం శ్రీముఖిని హిమజ.. రవిని వితికా షెరు.. రోహిణిని అషు ప్రాసిక్యూట్ చేసి వాళ్లు హౌస్‌లో కొనసాగడానికి అర్హత లేదని రకరకాల కారణాలను తెలియజేశారు. ఆ తర్వాత నాగ్ ఒక్కొకరికి ఒక్కో డైలాగ్ ఇచ్చి, హౌస్ లో మరొకరిని విలన్ గా ఎంపిక చేసుకుని డైలాగ్ చెప్పాలని చెప్పారు. దీంతో అందరూ అపోజిట్ పర్సన్ ని ఎంచుకుని డైలాగులు చెప్పారు.