Begin typing your search above and press return to search.

#BB4 పది మంది కంటెస్టెంట్స్‌ వీళ్లే

By:  Tupaki Desk   |   19 Aug 2020 4:00 AM GMT
#BB4 పది మంది కంటెస్టెంట్స్‌ వీళ్లే
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ప్రారంభం కాబోతుంది. మరికొన్ని రోజుల్లో షోను ప్రసారం చేయబోతున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ జాబితా రెడీ అయ్యింది. కాని అధికారికంగా మాత్రం షో ఆరంభం రోజునే వెళ్లడి చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈలోపు కొన్ని లీక్స్‌ అయితే వస్తూనే ఉన్నాయి. ఈ షో గురించి రెండు నెలలుగా ప్రచారం జరుగుతుంది. అప్పటి నుండి ఎన్నో పేర్లు వచ్చాయి. అయితే వారిలో చాలా మంది కూడా వార్తలను కొట్టి పారేశారు. తాజాగా మరికొన్ని పేర్లు ప్రచారం జరుగుతున్నాయి.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పది మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరు ఖచ్చితంగా బిగ్‌ బాస్‌ 4 హౌస్‌ లో ఉండబోతున్నారని అంటున్నారు. ఒక్కరు ఇద్దరు తప్ప వీరంతా కూడా వెళ్లే అవకాశం ఉందనిపిస్తుంది. ఇంతకు ఆ పది మంది ఎవరు అంటే సీనియర్‌ నటి సురేఖ వాణి.. సింగర్‌ మంగ్లీ.. నందు.. యంగ్‌ హీరో సుధాకర్‌ కొమ్మకుల.. టీవీ నటి సమీరా.. యూట్యూబర్‌ మహబూబ్‌ షేక్‌.. మరో యూట్యూబర్‌ హరిక.. టీవీ నటుడు సయ్యేద్‌ సోహెల్‌.. ఫేడ్‌ ఔట్‌ హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌.. నోయల్‌.

వీరు మాత్రమే కాకుండా మరి కొందరు కూడా హౌస్‌ లో ఎంటర్‌ టైన్‌ చేయబోతున్నారు. వీరిలో ఒక్కరు ఇద్దరు ఫైనల్‌ జాబితాలో లేకున్నా ఖచ్చితంగా వీరిలో ఎక్కువ శాతం మంది మాత్రం ఖచ్చితంగా బిగ్‌ బాస్‌ కొత్త సీజన్‌ లో ఉండబోతున్నారు అంటూ నమ్మకంగా చెబుతున్నారు. తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 కు సంబంధించి ఇప్పటికే ప్రోమో వచ్చేసింది. నాగార్జున మూడు విభిన్నమైన ఏజ్‌ గ్రూప్‌ లో కనిపించి మెప్పించాడు. షో పై అందరిలో ఆసక్తి కలిగించేలా ప్రోమో ఉంది. కంటెస్టెంట్‌ విషయంలో కూడా ఈసారి కాస్త ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సీజన్‌ ను మరింతగా ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారని మా వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.