Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 4కు వేళైంది.. ఈసారి మరింత మసాలా?

By:  Tupaki Desk   |   21 July 2020 11:30 AM IST
బిగ్ బాస్ 4కు వేళైంది.. ఈసారి మరింత మసాలా?
X
కరోనా కల్లోలంతో సినిమాలు బంద్ అయిపోయాయి. సీరియళ్లు మొన్ననే మొదలయ్యాయి. క్రికెట్ ఆడడం లేదు. దీంతో ఎంటర్ టైన్ మెంట్ లేక జనాలు పిచ్చెక్కిపోతున్నారు. కరోనాతో ఏం చేయలేని పరిస్థితులున్నాయి.

ఈ నేపథ్యంలో ఈసారి ఇప్పటికే ప్రారంభం కావాల్సిన అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ కూడా మొదలు కాలేదు. కరోనాతో అసలు ప్రారంభం అవుతుందా లేదా అన్న సందేహాలు వెంటాడాయి.

తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ ప్రోగ్రాంను ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నట్టు ‘స్టార్ మా’ టీవీ ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ లో వీడియో రిలీజ్ చేసింది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ ఈ ఏడాది కూడా ఉంటుందని.. త్వరలోనే ప్రారంభం అవుతుందని తెలిపింది.

ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్లు బంపర్ హిట్స్ అయ్యాయి. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 ను కూడా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. కరోనాతో కష్టం అనుకున్న దశలో నిర్వాహకులు ఈ ఏడాది కూడా బిగ్ బాస్ ను త్వరలోనే లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించడం అందరికీ ఊరట కల్పించింది.

అయితే కరోనా కారణంగా 100 రోజులకు బదులుగా కేవలం 70 రోజులు మాత్రమే ఈ బుల్లితెర షోను నిర్వహించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే సెలెబ్రెటీల వేటలో స్టార్ మా పడిందని సమాచారం. కొందరు వెండితెర నటులు ఖాళీగా ఉండడంతో వారిని రప్పిస్తున్నట్టు తెలిసింది. ఎపిసోడ్స్ తగ్గించినా ఈ సారి మాసాలా కాన్సెప్ట్.. గేమ్స్ తో ఎంటర్ టైన్ మెంట్ గా షోను నిర్వహించేందుకు స్టార్ మా సిద్ధమైంది.