Begin typing your search above and press return to search.

బిబి4 : మిర్చి ఘాటును మించిన ఎలిమినేషన్ నామినేషన్‌‌ పక్రియ మంట

By:  Tupaki Desk   |   13 Oct 2020 4:15 AM GMT
బిబి4 : మిర్చి ఘాటును మించిన ఎలిమినేషన్ నామినేషన్‌‌ పక్రియ మంట
X
బిగ్ బాస్‌ సీజన్‌ 4 ఆరవ వారంలోకి అడుగు పెట్టింది. ప్రతి సోమవారం మాదిరిగానే ఈ వారం కూడా ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియ జరిగింది. గత వారం అఖిల్‌ మరియు అభిజిత్‌ లు మోనాల్‌ విషయాన్ని తీసుకు వచ్చి ఒకరిని ఒకరు నామినేట్‌ చేయడంతో పాటు ఆమె విషయంలో కాస్త ఎక్కువగా మాట్లాడారు. దాంతో ఇద్దరికి కూడా మొన్న వీకెండ్‌ ఎపిసోడ్‌ లో నాగార్జున వార్నింగ్‌ ఇచ్చాడు. ఇక ఇద్దరు మళ్లీ ఈ వారం కూడా నామినేట్‌ చేసుకున్నారు. గత వారం మాదిరిగానే ఈ వారం కూడా అఖిల్‌ మరియు అభిజిత్‌ లు ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయ్యారు. గత వారంలో మాదిరిగా ఈ వారంలో కూడా ఏకంగా 9 మంది ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయినట్లుగా బిగ్‌ బాస్‌ ప్రకటించాడు.

ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియలో భాగంగా మిర్చి దండలు ఇద్దరికి చొప్పున ఒక్కరు వేయాల్సి ఉంటుంది. దివి మరియు మెహబూబ్‌ లకు ఎక్కవగా దండలు పడ్డాయి. అయితే కెప్టెన్‌ పవర్‌ ను ఉపయోగించి ఒకరిని సేఫ్‌ చేసే అవకాశం ఉండటంతో మెహబూబ్‌ ను సేవ్‌ చేస్తున్నట్లుగా సోహెల్‌ ప్రకటించాడు. సేఫ్‌ అవ్వడంతో మెహబూబ్‌ కన్నీరు పెట్టుకున్నాడు. ఎక్కువ దండలు పడ్డ మెహబూబ్‌ సేఫ్‌ అవ్వడంతో పాటు అమ్మ రాజశేఖర్‌ మరియు అవినాష్‌ లకు ఒక్క దండ కూడా పడక పోవడంతో వారిద్దరు సోహెల్‌ కెప్టెన్‌ అవ్వడం వల్ల అతడు సేఫ్‌ గా ఉన్నారు. ఈ నలుగురు కాకుండా మిగిలిన అంతా అఖిల్‌.. అభిజిత్‌.. లాస్య.. నోయల్‌.. అరియానా.. హారిక.. కుమార్‌ సాయి, మోనాల్‌ మరియు దివిలు నామినేట్‌ అయ్యారు.

ఈ వారం ఒక్కరి చేత నామినేట్‌ అయినా కూడా ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయినట్లుగా బిగ్ బాస్‌ ప్రకటించాడు. ఒక్కొక్క దండ పడ్డ వారు తాము సేఫ్‌ అనుకుంటూ ఉండగా బిగ్‌ బాస్‌ వారు కూడా నామినేట్‌ అయ్యారంటూ ప్రకటించడం జరిగింది. ఈ వారం ఆట తీరు మరియు ప్రవర్తన బట్టి ఎవరు వెళ్లి పోయేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇప్పటికే చాలా మంది కుమార్‌ సాయి అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్‌ కెప్టెన్‌ అవ్వడం వల్ల సేఫ్‌ అయిన కుమార్‌ సాయి ఈ వారం మళ్లీ ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయ్యాడు. మరి ఈ వారం సేఫ్‌ అయ్యేనా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.