Begin typing your search above and press return to search.
కౌశల్ - తనీష్ ఫైట్.. బిగ్ బాస్ తీవ్ర హెచ్చరిక
By: Tupaki Desk | 19 Sep 2018 4:23 AM GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ముగింపు దశకు చేరుకున్న సమయంలో ఇంటి సభ్యుల మద్య అంతరం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా కౌశల్ తో తనీష్ - సామ్రాట్ - రోల్ రైడాల గొడవలు శృతి మించుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో రేస్ టు ఫినాలే టాస్క్ ను నిర్వహించడం జరిగింది. ఆ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు రెండు జట్లుగా విడిపోతారు. గార్డెన్ ఏరియాలో ఉన్న మూడు కంటేనర్స్ లో ఇసుక నింపి ఉంది. ఆ ఇసుకను ఒక టీం సభ్యులు కాపాడుకోవాల్సి ఉండగా - మరో టీం సభ్యులు మాత్రం దాన్ని కింద పోసేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది.
ఒక టీంగా కౌశల్ - రోల్ రైడా - గీత మరోటీం సభ్యులుగా దీప్తి - తనీష్ - సామ్రాట్ లు ఉన్నారు. కౌశల్ - రోల్ రైడా - గీతలు ఇసుక కంటేనర్స్ ను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన ముగ్గురు ఆ ఇసుకను కింద పోసేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కౌశల్ కంటేనర్ లోని ఇసుకను తనీష్ మరియు సామ్రాట్ లు పూర్తిగా కింద పోయడంతో పాటు కంటేనర్ మొత్తం విరగొట్టారు. ఆ తర్వాత రోల్ రైడా కంటేనర్ ను ఖాళీ చేసేందుకు కౌశల్ ప్రయత్నించాడు. అయితే అనూహ్యంగా రోల్ రైడాకు సామ్రాట్ మరియు తనీష్ లు మద్దతుగా నిలిచారు.
కౌశల్ - రోల్ రైడా కంటేనర్ ను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అడ్డు వచ్చిన తనీష్ తో గొడవ జరిగింది. ముఖ్యంగా తనీష్ మరియు కౌశల్ లు శారీరక హింసకు పాల్పడ్డారు. ఒకరిని ఒకరు గాయ పర్చుకునే వరకు వెళ్లారు. మరో వైపు గీత కంటేనర్ ను దీప్తి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించి సఫలం అయ్యింది. తనీష్ - కౌశల్ ల వివాదం పెరగడంతో పాటు - ఫైట్ మరింత ముదిరే అవకాశం ఉందని భావించిన బిగ్ బాస్ వెంటనే టాస్క్ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించాడు.
కౌశల్ మరియు తనీష్ లపై బిగ్ బాస్ చాలా సీరియస్ అయ్యాడు. ఒకరిపై ఒకరు శారీరక హింసకు దిగవద్దని పదే పదే చెప్పినా కూడా బిగ్ బాస్ ఆదేశాలను పట్టించుకోకుండా వారిద్దరు గొడవ పడటంతో ఇద్దరిని బయటకు పంపిస్తానంటూ బిగ్ బాస్ హెచ్చరించాడు. పదే పదే బిగ్ బాస్ రూల్స్ ను అతిక్రమిస్తున్న ఇంటి సభ్యుల విషయంలో బిగ్ బాస్ పలు సార్లు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొత్తానికి బిగ్ బాస్ ముంగిపు దశకు చేరుకున్న సమయంలో ఆట రసవత్తరంగా మారింది.