Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ 4 షురూ అయ్యింది

By:  Tupaki Desk   |   8 Aug 2020 11:30 PM GMT
బిగ్‌ బాస్‌ 4 షురూ అయ్యింది
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ఈ నెల 30 నుండి ప్రసారం కాబోతుందని స్టార్‌ మా వర్గాల నుండి అనధికారిక క్లారిటీ వచ్చేసింది. కాస్త అటు ఇటుగా అదే తేదీకి షో ప్రారంభం అవ్వడం కన్ఫర్మ్‌ గా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో బిగ్‌ బాస్‌ ఏంటో అంటూ కొందరు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కంటెస్టెంట్స్‌ ఆరోగ్యం విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎంపిక అయిన కంటెస్టెంట్స్‌ ను రెండు వారాల పాటు క్వారెంటైన్‌ లో ఉంచాలని నిర్ణయించారు.

బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ మరియు ముఖ్యమైన టెక్నీషియన్స్‌ క్వారెంటైన్‌ షురూ చేశారట. బిగ్‌ బాస్‌ సెట్‌ సమీపంలోనే వీరిని ఉంచారు. అక్కడ నుండి నేరుగా బిగ్‌ బాస్‌ సెట్‌ లోకి పంపించబోతున్నారు. ఇక స్టేజ్‌ పైకి వారిని ఆహ్వానించే సమయంలో కూడా మాస్క్‌ లు పెట్టుకుని ఉండటంతో పాటు వారి సోలో పెర్ఫార్మెన్స్‌ మాత్రమే ఉంటుందట. గతంలో గ్రూప్‌ డాన్స్‌ తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హౌస్‌ లోకి వెళ్లే వారు. ఇప్పుడు అలా చేయడం వల్ల మళ్లీ రిస్క్‌ అవుతుంది. అందుకే కంటెస్టెంట్స్‌ ను ఇకపై బయటి వారితో కలవకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఈసారి అత్యంత విభిన్నంగా బిగ్‌ బాస్‌ సీజన్‌ ప్రారంభం ఉంటుందని కూడా టాక్‌ వినిపిస్తుంది. నాగార్జున గత సీజన్‌ లో వారి చేయి పట్టుకుని హౌస్‌ లోకి తీసుకు వెళ్లాడు. కాని ఈసారి అసలు కంటెస్టెంట్స్‌ నాగార్జునను కలిసే అవకాశం లేదని కూడా టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి బిగ్‌ బాస్‌ పక్రియ ప్రారంభం అయ్యిందని షో నిర్వాహకులు లీక్‌ ఇస్తున్నారు.