Begin typing your search above and press return to search.

Bigg Boss 6: ఒకరు అవుట్.. ఇక టాప్ 5 లిస్ట్ ఇదే!

By:  Tupaki Desk   |   15 Dec 2022 3:05 PM GMT
Bigg Boss 6: ఒకరు అవుట్.. ఇక టాప్ 5 లిస్ట్ ఇదే!
X
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది. మొత్తంగా ఈ సీజన్లో అత్యధికమంది కంటెస్టెంట్స్ పోటీ పడిన విషయం తెలిసిందే. మొత్తం 21 మంది హౌస్ లోకి రాగా రెండుసార్లు డబుల్ ఎలిమినేషన్స్ జరిగాయి. ఇక 15వ వారంతో బిగ్ బాస్ కు ముగింపు కార్డు పడబోతోంది. ఇక ఈసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనే విషయంలో కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతోంది.

ఇక ప్రస్తుతం అయితే మొత్తంగా హౌస్ లో 6 మంది ఉండగా రీసెంట్ గా ఒకరు ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ లో చివరి వారం రోహిత్ శ్రీహాన్ కీర్తి శ్రీ సత్య రేవంత్ ఆదిరెడ్డి ఉండగా వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని బిగ్ బాస్ ముందుగానే చెప్పాడు. మిగిలిన వారు టాప్ 5 ఫైనల్స్ లో పోటీపడతారని కూడా అన్నారు.

ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం శ్రీ సత్య ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ఆమె అసలు గత వారమే వెళ్ళిపోతుందని టాక్ గట్టిగానే వచ్చింది. ఇక శ్రీహన్ తో బాండింగ్ తగ్గిన తరువాత ఆమె రేంజ్ తగ్గింది.

అయినా ఇంతవరకు రావడమే గొప్ప అనే తరహాలో కూడా సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వచ్చాయి. ఈ వారం శ్రీ సత్య హౌస్ లో ఉండడానికి గట్టిగానే పోరాడింది. కానీ మిగతా వాళ్ళు మరింత బలంగా ఉండడంతో శ్రీ సత్య నిలదొక్కుకోలేకపోయింది.

ఇక ఆమె వెళ్లిపోవడంతో ఇప్పుడు హౌస్ లో అయితే కేవలం ఒకే ఒక అమ్మాయి శ్రీ కీర్తి మాత్రమే మిగిలింది. ఇక ఇప్పుడు టాప్ 5 ఫైనల్ లో రేవంత్ ఆదిరెడ్డి శ్రీహాన్ కీర్తి మాత్రమే మిగిలి ఉన్నారు. వీరిలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా రేవంత్ నిలుస్తాడాని చాలా రోజులుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అలాగే శ్రీహాన్ రోహిత్ కూడా బలమైన పోటీ దారులుగా కనిపించే అవకాశం అయితే ఉంది. మరి బిగ్ బాస్ చివరి అడుగులో ఎవరు టైటిల్ విన్నర్ గా నిలుస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.